ఏ రంగంలో అడుగిడినా ముందడుగు వేస్తూ..
చదువులోనే కాదు.. సాంస్కృతిక కార్యక్రమాలలోనూ..
పలు రంగాల్లో ప్రతిభ చూపుతూ..
కాశీలో జరిగిన వోకల్ ప్రజెంటేషన్‌లో వరల్డ్ రికార్డు
సాక్షి, హైదబారాద్: ఏదైనా రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమించాలి.. అలాంటిది అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాలి? ఏదైనా పని మొదలు పెట్టాలన్నా.. కొత్త రంగంలోకి వెళ్లాలన్నా ఇంటి నుంచే సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొంటుంటాం. మనకు అవసరమా..? చక్కగా ఉన్న పని చేసుకుని హాయిగా ఉండొచ్చుగా అని సలహాలు ఇస్తుంటారు. మరికొందరేమో రెండు, మూడు పడవలపై ప్రయాణం చేయడం మంచిది కాదంటూ హితవు పలుకుతారు.
ఇంకొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వైఫల్యం గురించి బాధపడుతూ ఒకే దగ్గర కూర్చుంటే అంతకన్నా వైఫల్యం మరొకటి ఉండదని నిరూపిస్తున్నారు డాక్టర్ లాక్షనాయుడు. డాక్టర్‌గా, సింగర్‌గా, శాస్త్రీయ నృత్యకారిణిగా, రాజకీయవేత్తగా చిన్న వయసులోనే రాణిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment