
యూట్యూబ్‌లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు టీటీఎఫ్ వాసన్. యూట్యూబ్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఏకంగా సినిమా ఛాన్సే పట్టేశాడు, అది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, కమెడియన్‌గానో అనుకునేరు.. నేరుగా హీరోగా మారిపోయాడు. వాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మండల్ వీరన్. ఇటీవలే అతడి బర్త్‌డే సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు మంచి ప్రశంసలు లభించాయి.
ఇదిలా ఉంటే వాసన్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఆ మధ్య బైక్‌పై అతివేగంగా వెళ్తూ పోలీసులతో చీవాట్లు తిన్న ఇతడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. కారులో వేగంగా వెళ్తున్న అతడు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది.
ఈ ఘటనతో భయపడ్డ వాసన్ వెంటనే సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తన కారును అక్కడే వదిలేసి ఆటో ఎక్కి అక్కడి నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత నిర్లక్ష్యంగా కారు నడుపుతున్న నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment