దొడ్డబళ్లాపురం: సోషల్ మీడియా వచ్చాక అనేకమంది యూట్యూబర్లు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకూ వెళ్లి వీడియోలు తీస్తూ ఎన్నో కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. అయితే కొన్నిచోట్ల దుందుడుకు వ్యక్తులు యూట్యూబర్లపై దాడులకు పాల్పడడం చూస్తుంటాం. భారత సిలికాన్ సిటీ బెంగళూరులో అటువంటి సంఘటనే జరిగింది.
భారత పర్యటనకు వచ్చిన నెదర్లా్‌ండ్స్‌కు చెందిన యూట్యూబర్ ఫెడ్రో మోటా ఆదివారంనాడు బెంగళూరులోని సండే బజార్ ఆలియాస్ చోర్ బజార్‌ను వీడియో తీస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. నవాజ్ హయత్ షరీఫ్ అనే స్థానిక వ్యాపారి ఫెడ్రోను అడ్డగించి వీడియో ఎందుకు తీస్తున్నావంటూ దౌర్జన్యం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఫెడ్రో అక్కడి నుండి గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అన్నీ లైవ్ వీడియోలో రికార్డయ్యాయి.
ట్విట్టర్లో పోలీసులకు ఫిర్యాదు
ముదాసిర్ అహ్మద్ అనే వ్యక్తి ఈ వీడియోను బెంగళూరు సిటీ పోలీసులకు రీట్వీట్ చేసి దుండగునిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. స్థానిక కాటన్‌పేట పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నవాజ్ హయత్ షరీఫ్‌ని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment