తలతిక్క యూట్యూబర్‌కు షాకిచ్చిన పోలీసులు | - | Sakshi

తలతిక్క యూట్యూబర్‌కు షాకిచ్చిన పోలీసులు

Aug 11 2023 7:20 AM | Updated on Aug 11 2023 8:20 AM

మాస్కు ధరించి స్టంట్‌లు చేస్తున్న యూట్యూబర్‌  - Sakshi

మాస్కు ధరించి స్టంట్‌లు చేస్తున్న యూట్యూబర్‌

మాస్క్‌ ధరించి బైక్‌పై తిరుగుతూ కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో సిగ్నల్స్‌ జంప్‌ చేసి వన్‌వేలో వెళ్లి ఒక కారు అద్దాలు పగలగొట్టి పరారయ్యాడు.

కర్ణాటక: ముఖానికి మాస్క్‌ ధరించి బైక్‌పై తిరుగుతూ రద్దీగా ఉన్న రోడ్లపై స్టంట్‌లు చేస్తూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేసిన యూట్యూబర్‌ను యలహంక పోలీసులు అరెస్టు చేసారు. మహమ్మద్‌ జావిద్‌ అరెస్టయిన యూట్యూబర్‌.

ఇతడు తలతిక్క వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఈక్రమంలోనే ఇటీవల ముఖానికి మాస్క్‌ ధరించి బైక్‌పై తిరుగుతూ కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో సిగ్నల్స్‌ జంప్‌ చేసి వన్‌వేలో వెళ్లి ఒక కారు అద్దాలు పగలగొట్టి పరారయ్యాడు.

ఈ వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేసాడు. జరిగిన సంఘటన మరియు వీడియోపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసుకున్న యలహంక పోలీసులు జావిద్‌ను అరెస్టు చేసి బైక్‌ సీజ్‌ చేసారు. యలహంక ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement