తీరు మారని దర్శకేంద్రుడు.. నెటిజన్ల విమర్శలు | Netizens Trolls On Director Raghavendra Rao Over His Behaviour With Actresses At Film Event, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Raghavendra Rao: ఆ హక్కు ఎవరిచ్చారు? రాఘవేంద్రరావుపై నెటిజన్ల ఫైర్

Jun 19 2026 7:49 AM | Updated on Jun 19 2026 4:06 PM

Trolls On diretcor Raghavendra rao behaviour with actresses in tollywood

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు గానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో మెగా హీరోయిన్ నిహారిక కొణిదెలతోనూ ఈయన ప్రవర్తించిన విధానంతో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అనుమతి లేకుండా ఒక మహిళని తాకడం, ముట్టుకోవడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేశారు. వెంకీ-అనిల్ రావిపూడి మూవీ లాంచ్ ఈవెంట్‌లోనూ రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమవుతోంది.

గురువారం జరిగిన వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ పూజా కార్యక్రమంలో రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా హీరోయిన్ కృతి శెట్టి భుజంపై చేతులు వేయడం, తర్వాత కూడా హీరోయిన్ల చేతులు పట్టుకుని కనిపించడంపై కొంతమంది విమర్శలు చేస్తుండగా.. మరికొందరేమే షూటింగ్ ప్రక్రియలో భాగమే అంటున్నారు.

తాజాగా ఓ నెటిజన్ నిహారికతో దర్శకుడు రాఘవేంద్రరావు వ్యవహరించిన వీడియోను షేర్ చేసింది. అసలు ఈ ముసలాయన ఎవరు? అలా ఎందుకు చేస్తున్నారు? మహిళల అనుమతి లేకుండా వారిని తాకే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. ఆమెకు మద్దతుగా పలువురు పోస్టులు పెడుతున్నారు. 


 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement