
సహజమైన నటన అంటేనే తనకు ఇష్టమని అంటోంది ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్. తాను ఏ సినిమాలో నటించిన సహజ నటన కోసమే పరితపిస్తానని ఆమె తెలిపారు. చైన్నెలోని మొగప్పైర్‌లో ఉన్న పేజీ 3 లగ్జరీ మేక్‌ఓవర్ స్టూడియో సంస్థ మొదటి సంవత్సరం వేడుకలు నటి ఐశ్వర్య రాజేష్, పారిశ్రామిక వేత్త వీణా కుమారవేల్, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్త మీనాక్షి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు వారి వారి రంగాల్లో రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సినీ తారలను స్ట్లైలింగ్ చేయడంలో బ్యూటీ సంస్థల పాత్ర ఎనలేనిది అని కొనియాడారు. తాను సినిమా ల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలపైనే కాకుండా సహజమైన నటన పై దృష్టి పెడతానన్నారు. అందువల్లే తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇందులో నిర్వాహకులు షణ్ముగ కుమార్ పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే మలయాళ చిత్రం పులిమాడలో ఐశ్వర్య రాజేశ్ కనిపించింది.