కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శ్రుతిహాసన్. తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించి తొలి సినిమాకే మంచి గుర్తింపును సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంలో నెలకొన్న ఒడిదుడుకులతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
ఇక ఇటీవలె క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2016లొ నాగ చైతన్యతో కలిసి నటించి ప్రేమమ్ సినిమా గురించి మాట్లాడుతూ..
ఆ పినిమాలో నేను చేసిన మలర్ పాత్రను మలయాళ ఒరిజినల్ వెర్షన్ సాయిపల్లవితో పోల్చి నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో బాధపడ్డా. అసలు సినిమాలో నటించకుండా ఉండాల్సింది అని ఒకానొక సమయంలో బాగా ఫీల్ అయ్యాను. అయితే ఇది కొంతసేపే. ట్రోల్స్ గురించి పక్కన పెడితే, ఆ సినిమాలో మరల్ పాత్ర చేస్తున్నప్పుడు ప్రతిక్షణం ఎంజాయ్ చేశాను అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment