![Shruti Haasan On Being Called Iron Leg - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/7/sruthi-haasan.jpg.webp?itok=05VYXdNR)
హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో తనను కొందరు అన్ లక్కీ అన్నారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు శ్రుతీహాసన్. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడుతూ – ‘‘అందరికీ ఉండే భయాలతోనే నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్ పాత్రలకు సరిపోనని, నా వాయిస్ బాగోలేదని, నేను సక్సెస్‌ఫుల్ మూవీ స్టార్‌గా ఎదగలేనని కొందరు నా గురించి మాట్లాడుకున్నారు. దీనికి తోడు తెలుగులో నేను చేసిన తొలి రెండు సినిమాలు (అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్) అంతగా ఆడలేదు.
దీంతో నేను ‘అన్ లక్కీ’ అని, ‘ఐరన్ లెగ్’ అని మాట్లాడుకున్నారు. కానీ తెలుగులో నేను చేసిన మూడో సినిమా (గబ్బర్‌సింగ్) హిట్ కావడంతో నన్ను గోల్డెన్‌లెగ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓవర్‌నైట్‌లో అంతా మారిపోయింది. మన గురించి ఇతరుల అభిప్రాయాలు వారికి తోచినట్లుగా ఉండొచ్చు. కానీ మనం మనతో నిజాయితీగా మాట్లాడుకోవాలి. అప్పుడే మన సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందని నా నమ్మకం. నా సక్సెస్‌ఫుల్ సినీ కెరీర్‌లో తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానం చాలా ముఖ్యమైనవి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment