సమయానుకూలంగా మారిపోయే నటుడు కమలహాసన్. ఈయనలో గొప్పనటుడితో పాటు రాజకీయనాయకుడు ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతకుమించి గొప్ప తాత్వికుడు, ప్రేమికుడు ఉన్నారు. ప్రేమకు నిర్వచనాలు చాలానే ఉన్నాయి. అది ఎవరితోనైనా ఎప్పుడైనా పంచుకోగలిగినవారే పరిపూర్ణ మనిషి అవుతారు. కమలహాసన్ పెద్దల్లో పెద్దగా చిన్నవాళ్లలో చిన్నవాడిగా మారిపోతుంటారు.
అందుకు చిన్న ఉదాహరణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరులవుతున్న వీడియో. పులి కడుపున పులిపిల్లే పుడుతుంది అనడానికి ఒక ఉదాహరణ శ్రుతిహాసన్. తండ్రి వారసురాలుగా సినీ రంగప్రవేశం చేసిన శ్రుతిహాసన్ ఇక్కడ తనను నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలుగా పలు కోణాల్లో ఆవిష్కరించుకున్నారు.
తన తండ్రి అన్నా, ఆయన చిత్రాలు అన్నా ఇష్టపడే శ్రుతిహాసన్ తాజాగా కమలహాసన్ నాలుగు దశాబ్దాల క్రితం కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రంలో ఇళయరాజా సంగీతాన్ని అఃదించీన విక్రమ్ విక్రమ్ అనే థీమ్ సాంగ్‌ను ఎంతో తన్మయత్వంతో ఆస్వాదిస్తూ రిథమిక్‌గా హావభావాలను పలికిస్తూ ఉండగా హఠాత్తుగా చివరలో కమలహాసన్ ఎంట్రీ ఇచ్చి చిరు దరహాసంతో హాయ్ చెప్పి ఆమెకు సర్ప్‌రైజ్ ఇచ్చారు. ఇది ఆ తండ్రి కూతురు మధ్య ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. కమలహాసన్‌లో గొప్ప నటుడు లేక రాజకీయనాయకుడు కాకుండా ఒక కూతురిని ప్రేమించే తండ్రి మాత్రమే కనిపించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment