అమ్మాయిలను వారి పెళ్లి గురించి అడగడం మానుకోండి అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇంతకీ విషయం ఏంటంటే.. వీలైనప్పుడల్లా సోషల్ మీడియా మాధ్యమాల్లో నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహించడం శ్రుతీహాసన్‌కు అలవాటు. ఇటీవల మరోసారి ఈ బ్యూటీ చాట్ సెషన్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా... ‘మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగితే శ్రుతీహాసన్ కాస్త గట్టిగానే బదులిచ్చారు.
‘‘ఇది 2024... అమ్మాయిలను ఇలాంటి ఉపయోగం లేని వెర్రి ప్రశ్నలు అడగడం మానుకోండి’’ అంటూ బదులిచ్చారామె. అలాగే ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడమ్’ అని మరో నెటిజన్ శ్రుతీహాసన్‌ను ప్రశ్నించగా... ‘ఐ వోన్ట్ సార్’ (చేసుకోను సార్) అని బదులిచ్చారు. అంటే... పెళ్లి చేసుకోనని సూటిగా చెప్పేశారు. ఇక సినిమాల విషయానికొస్తే... అడివి శేష్‌తో ‘డెకాయిట్’ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రభాస్‌తో ‘సలార్ 2’, తమిళంలో ‘చెన్నై స్టోరీ’ సినిమాలు కూడా శ్రుతి చేతిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment