మహేష్, శృతి హాసన్ లకు అభిమాని 'క్లిక్' | mahesh babu, shruti hassan shooting pic clicked by fan | Sakshi
Sakshi News home page

మహేష్, శృతి హాసన్ లకు అభిమాని 'క్లిక్'

Published Thu, Nov 13 2014 8:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

మహేష్, శృతి హాసన్ లకు అభిమాని 'క్లిక్'

మహేష్, శృతి హాసన్ లకు అభిమాని 'క్లిక్'

మహేష్బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పుణెలో జరుగుతోంది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను ఇక్కడి ఐటీ పార్క్ లో తెరకెక్కిస్తున్నారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా షూటింగ్ కొనసాగిస్తున్నారు. తమ అభిమాన హీరో హీరోయిన్ల షూటింగ్ చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున గుమిగూడుతున్నారు. పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే.

మహేష్బాబు, శృతిహాసన్ ను చూసేందుకు అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. ఒకానొక దశలో అభిమానులు అదుపు చేయడం సినిమా యూనిట్ కు కష్టతరమవుతోంది. ఓ అభిమాని అయితే షూటింగ్ స్పాట్ లో ఉన్న మహేష్బాబు, శృతిహాసన్ లను తన కెమెరాలో బంధించాడు. దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఫోటోను అభిమానులు ఆసక్తిగా తిలకించడమే కాకుండా, లైకులు మీద లైకులు కొడుతున్నారు. సాక్షి పోస్ట్(www.sakshipost.com)లో పోస్టు చేసిన ఈ ఫోటోను శృతిహాసన్ తన ట్విటర్ పేజీలో షేర్ చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement