కొత్త ఏడాదే... సింహగర్జన | Singam 3 post poned to january 26th | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదే... సింహగర్జన

Dec 22 2016 12:28 AM | Updated on Sep 4 2017 11:17 PM

కొత్త ఏడాదే... సింహగర్జన

కొత్త ఏడాదే... సింహగర్జన

సింహం ఎప్పుడు గర్జిస్తుంది? అనే ఉత్కంఠకు తెర పడింది. సింహం థియేటర్లలోకి వచ్చేది కొత్త ఏడాదిలోనే అని చిత్ర బృందం ప్రకటించింది.

సింహం ఎప్పుడు గర్జిస్తుంది? అనే ఉత్కంఠకు తెర పడింది. సింహం థియేటర్లలోకి వచ్చేది కొత్త ఏడాదిలోనే అని చిత్ర బృందం ప్రకటించింది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సింగం–3’. ‘సింగం’ సిరీస్‌లో వస్తోన్న ఈ మూడో సినిమాను తమిళంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత మల్కాపురం శివకుమార్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేయాలను కున్నారు. వారం ముందు రామ్‌చరణ్‌ ‘ధృవ’ రిలీజవుతోందని ఈ నెల 23కి ‘సింగం–3’ విడుదల తేదీ మార్చారు.

అయితే... 23న కూడా సినిమా విడుదల లేదని 15వ తేదీనే సూర్య స్పష్టం చేశారు. మా చేతుల్లో లేని పలు కారణాలే వాయిదాకు కారణమని పేర్కొన్నారు. తమిళనాడులో జయ లలిత మరణం తదనంతర పరిస్థితుల వల్లే సినిమా వాయిదా పడిందని వార్తలొచ్చాయి. కారణాలు ఏవైనా... ఇప్పుడు వచ్చే జనవరి 26న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అనుష్క, శ్రుతీహాసన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హ్యారీస్‌ జయరాజ్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement