సీఎం సింప్లిసిటీకి ముగ్దుడైన స్టార్ హీరో | Suriya shoks over by Kerala CM simplicity | Sakshi
Sakshi News home page

సీఎం సింప్లిసిటీకి ముగ్దుడైన స్టార్ హీరో

Published Fri, Jan 20 2017 2:31 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

సీఎం సింప్లిసిటీకి ముగ్దుడైన స్టార్ హీరో

సీఎం సింప్లిసిటీకి ముగ్దుడైన స్టార్ హీరో

కొచ్చి : స్టార్ హీరో సూర్యకు కేరళ సీఎం పినరయి విజయన్ సింప్లిసిటీ తెగనచ్చింది. తన తదుపరి చిత్రం సీ3  ప్రమోషన్‌ లో భాగంగా సూర్య కేరళలో పర్యటిస్తున్నారు. త్రివేండ్రమ్ నుంచి కొచ్చి వెళుతుండగా అనుకోకుండా కేరళ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. సీఎంను కలవడం తన స్కూల్ హెడ్ మాస్టర్ను కలిసినట్టుందని సూర్య ఆనందం వ్యక్తం చేశారు. ఒక వీవీఐపీ హోదాలో ఉన్న వ్యక్తి ప్రయాణికులందరూ దిగే వరకు వేచి చూసి చివరకు వెళ్లడం అంత మామూలు విషయం కాదని ప్రశంసలతో ముంచెత్తారు.

సూర్య నటించిన ఎస్‌–3 చిత్రం పేరు ఇటీవలే సీ-3గా మార్పు చేసిన విషయం తెలిసిందే. మాతృభాషలో సినిమా పేర్లు ఉండాలని సింగమ్3ని చింగమ్-3గా మార్పు చేశారు. 24 వంటి సూపర్‌హిట్‌ చిత్రం తరువాత సూర్య నటించిన చిత్రం సీ‌–3. ఈ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన సింగం, సింగం–2 చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం సీ‌–3. ఇందులో సూర్యకు జంటగా అనుష్కతో పాటు శ్రుతీహాసన్‌ నటించారు.

హరి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించారు. పూర్తి కమర్షియల్‌ అంశాలతో పక్కా మాస్‌ చిత్రంగా తెరకెక్కిన చిత్రం సీ‌–3. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్, ఛేజింగ్‌ సన్నివేశాలతో పాటు అనుష్క, శ్రుతీహాసన్‌ల అందాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

గతేడాది డిసెంబర్‌ 16న సీ‌–3 చిత్రం విడుదల కావలసి ఉండగా పెద్ద నోట్ల ప్రభావం, తదితర అంశాల కారణంగా విడుదలను నిర్మాత వాయిదా వేసుకున్నారు. కాగా చిత్రాన్ని ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement