సిన్సియర్ సింహం! | surya singam 3 audio on December 16 | Sakshi
Sakshi News home page

సిన్సియర్ సింహం!

Published Mon, Nov 7 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

సిన్సియర్ సింహం!

సిన్సియర్ సింహం!

సింహం.. సిన్సియర్ పోలీసాఫీసర్ నరసింహం వచ్చేస్తున్నాడు. సింహ గర్జన ఎలా ఉంటుందో చెప్పడానికి సాంపిల్ అన్నట్టు నేడు టీజర్‌తో వచ్చేస్తున్నాడు. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా ‘సింగం-3’. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘సింగం’ ఫ్రాంచైజీలో ఈ మూడో సినిమా టీజర్‌ను నేడు విడుదల చేస్తున్నారు. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటల్ని ఈ నెలాఖరున, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామని శివకుమార్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement