అక్టోబర్ 1న పులి | puli movie release date oct 1 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 1న పులి

Published Wed, Sep 16 2015 4:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

అక్టోబర్ 1న పులి

అక్టోబర్ 1న పులి

పులిగా ఇళయదళపతి గాండ్రించడానికి సిద్ధం అవుతున్నారు. విజయ్ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైంది చిత్రం పులి. ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.చిరకాలం తరువాత శ్రీదేవి తమిళంలో నటించిన చిత్రం పులి. అందాల భామలు హన్సిక, శ్రుతిహాసన్ నాయికలు కనువిందు చేయనున్న ఈ చిత్రంలో కన్నడు సూపర్‌స్టార్ సుదీప్ ప్రతినాయకుడిగా విజృంభించనున్నారు.

శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సాంఘిక జానపద కథా చిత్రాన్ని ఎస్‌కేటీ ఫిలింస్ పతాకంపై పీటీ.సెల్వకుమార్, విబుతమీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్ర టీజర్,పోస్టర్, ఆడియో ఆవిష్కరణ అంటూ వరుసగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 17 నే పులిని తెరపైకి తీసుకురావాలని మొదట నిర్ణయించారు.

అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో అక్టోబర్ ఒకటవ తేదీకి విడుదలను మార్చుకున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావడంతో మంగళవారం సెన్సార్‌కు పంపినట్లు తెలిసింది. పులి ఆ బాలగోపాలాన్ని అలరించే విధంగా జనరంజికంగా రావడంతో యూ సర్టిఫికెట్ వస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement