డైరీ ఫుల్! | Shruti Hassan dumps Nagarjuna! | Sakshi
Sakshi News home page

డైరీ ఫుల్!

Published Wed, Mar 25 2015 11:14 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

డైరీ ఫుల్! - Sakshi

డైరీ ఫుల్!

 తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు శ్రుతీ హాసన్.  ప్రస్తుతం తమిళ నటుడు విజయ్, మహేశ్‌బాబు చిత్రాల్లో నటిస్తున్న శ్రుతి  తాజాగా ఓ చిత్రం నుంచి తప్పుకున్నారని సమాచారం. పీవీపీ ప్రొడక్షన్స్ పతాకంపై నాగార్జున, కార్తీ హీరోలుగా తెలుగు, తమిళ భాషల్లో  ఓ చిత్రం ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో కార్తీ సరసన శ్రుతీహాసన్‌ను తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. ముందు ఈ చిత్రం ఒప్పుకున్నా, ఆ తర్వాత డైరీ చెక్ చేసుకుంటే, తేదీ ల్లేవట. అందుకని, ఈ చిత్రం నుంచి శ్రుతీ తప్పుకున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement