కమల్‌తో శ్రుతి డాన్స్ | Shruti Hassan Dance with Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్‌తో శ్రుతి డాన్స్

Published Sun, Nov 30 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

కమల్‌తో శ్రుతి డాన్స్

కమల్‌తో శ్రుతి డాన్స్

నటుడు కమలహాసన్‌తో కలసి ఆయన కూతురు క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్ లెగ్‌షేక్ చేయనున్నారని, ఈ అరుదైన మేళవింపులో సాగే ఆ నృత్య గీతికకు హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికకాబోతున్నట్లు సినీవర్గాల సమాచారం. కమలహాసన్ ఎంత గొప్ప నటుడో, అంత మంచి డాన్సర్. ఈయనతో శ్రుతిహాసన్‌ను నటింప చేయాలని కనీసం ఒక పాటలోనైనా ఆడించాలని జరిగిన పలు ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇటీవల కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రంలో శ్రుతిని ఒక్క పాటలో నటింప చేయాలని ఆ చిత్ర దర్శకుడు, కమల్ మిత్రుడు రమేష్ అరవింద్ చాలా ప్రయత్నం చేసి విఫలం అయ్యారనే ప్రచారం జరిగింది. అలాంటిది కమల్, శ్రుతిహాసన్ ఒక వేదికపై ఒక పాటకు కలిసి డాన్స్ చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది.
 
 ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం ప్రాంతంలో హుదూద్ తుపాను ప్రళయం తాండవం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ప్రాణనష్టం ఆస్తినష్టం ఎక్కువై అతలాకుతలం అయ్యాయి. ఆ తుపాను బాధితుల్ని ఆదుకోవడానికి పలువురు పలు రకాలుగా సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ మేము సైతం అంటూ స్టార్‌నైట్స్ లాంటి పలు వినోద కార్యక్రమాలతో నిధిని సేకరించే కార్యక్రమానికి సిద్ధం అయ్యింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో వివిధ వినోదపు కార్యక్రమాలతో తారలు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ తారలతో పాటు కోలీవుడ్‌కు చెందిన కమలహాసన్, సూర్య, కార్తీ, శ్రుతిహాసన్, శ్రీయ మొదలగు పలువురు నటీనటులు పాల్గొననున్నారని సమాచారం. ఈ వేదికపై కమలహాసన్, శ్రుతిహాసన్ కలిసి డాన్స్ చేయనున్నట్లు తెలిసింది. వీరిద్దరితో ఆడించే క్రెడిట్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాదేకే దక్కుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement