కన్న కూతురి పేరుని తండ్రి మరచిపోతే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే ‘నా పేరుని మా నాన్న మరచిపోయారు’ అని శ్రుతీహాసన్ అంటే, ఎవరైనా ఆశ్చర్యపోతారు. కమల్‌హాసన్ ముద్దుల కూతురు శ్రుతి ప్రస్తుతం తన తండ్రికి రీల్ డాటర్‌గా ‘శభాష్ నాయుడు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కమల్ రెండో కూతురు అక్షరాహాసన్ సహాయ దర్శకురాలిగా చేస్తున్నారు. తండ్రి, చెల్లితో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు శ్రుతి.
ఈ చిత్ర షూటింగ్ స్పాట్‌లో కొన్నాళ్ళ క్రితం జరిగిన గమ్మత్తై విషయాన్ని శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కమల్ నాకు నాన్న మాత్రమే కాదు.. ఈ చిత్రదర్శకుడు, కో-స్టార్ కూడా. భలే గమ్మత్తుగా ఉంది. ఒక సీన్‌లో ఆయన నన్ను పేరు పెట్టి పిలవాలి. కానీ, ఈ సినిమాలో నా పాత్ర పేరుతో కాకుండా నా రియల్ నేమ్‌తో పిలిచారు. అప్పుడు నేను ‘రాంగ్ నేమ్ అయినా.. థ్యాంక్యూ’ అన్నాను. ఈ సినిమా నాకో స్వీట్ మెమరీ అవుతుంది’’ అనినవ్వుతూ అన్నారు. ఈ చిత్రం కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమితో శ్రుతీకి మనఃస్పర్థలు వచ్చాయనే వార్త రావడం, అలాంటిదేమీ లేదని శ్రుతి స్పష్టం చేయడం తెలిసిందే.
కమల్‌కి గౌతమి అత్యంత సన్నిహితురాలనీ, ఇద్దరూ కలసి ఉంటారనీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గౌతమితో మనఃస్పర్థలు నెలకొన్నాయనే వార్త వచ్చిన తర్వాత మీరు ఆమెతో మాట్లాడారా? అని శ్రుతీని ఓ ఆంగ్ల పత్రిక అడిగితే - ‘‘మా నాన్న కాంబినేషన్‌లో చేస్తున్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి చిన్న బ్రేక్ వచ్చింది. నేను నా మిగతా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. మా నాన్ననీ, చెల్లెల్నీ కలవడానికి కూడా తీరిక లేదు. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఈ ప్రపంచంలో నాకు ముఖ్యమైన వ్యక్తుల్లో మా నాన్నగారు ఒకరు. ఆయనకు ముఖ్యమైన వ్యక్తి(గౌతమి)ని నేను కచ్చితంగా గౌరవిస్తా’’ అన్నారు.
నా పేరుని మా నాన్న మరచిపోయారు!
Published Fri, Sep 2 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
Advertisement
Advertisement