గ్లామర్ అంటే ఏంటో..?
‘‘నచ్చిన వ్యక్తితో అనుబంధం అనేది లెక్కల సబ్జెక్ట్ లాంటిది. లెక్కలెంత కష్టమోచ అనుబంధాన్ని కాపాడుకోవడమూ అంతే కష్టం. లెక్కల్లో తప్పినా జీవితం గడిపేయవచ్చు. కానీ, అనుబంధమనే లెక్క తప్పితే మాత్రం కష్టం. అందుకే, నాకు బాగా తీరిక ఉన్నప్పుడే అనుబంధం గురించి ఆలోచిస్తా’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ప్రస్తుతానికైతే ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదంటున్న శ్రుతి ఎప్పుడూ ఒంటరిగా ఉండిపోలేం కాబట్టి, భవిష్యత్తులో తీరిక చిక్కడంతో పాటు, నచ్చిన వ్యక్తి తారసపడితే అప్పుడు ‘రిలేషన్‌షిప్’ గురించి ఆలోచిస్తాను అన్నారు. మీరెక్కువగా గ్లామర్ ప్రధానంగా సాగే పాత్రలే చేస్తున్నారెందుకని అనే ప్రశ్న శ్రుతి ముందుంచితే -‘‘కెరీర్ ప్రారంభించిన తర్వాత నన్నీ ప్రశ్న చాలామంది అడిగారు. కానీ, ఇప్పటివరకు నాకు ‘గ్లామర్’ అంటే ఏంటో అర్థం కావడం లేదు. అర్థం అయినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతా’’ అన్నారు.