కుదుటపడిన శృతి హాసన్ ఆరోగ్యం, రేపు ఢిశ్చార్జి!
అనారోగ్య కారణాలతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సినీ తార శృతి హసన్ ఆరోగ్యం కుదుటపడినట్టు వైద్యులు తెలిపారు. కడుపు నొప్పితో శృతి హాసన్ ఆదివారం రాత్రి అపోలోలో చేరారు. వైద్య పరీక్షల నిర్వహించి.. శృతి హసన్ కు చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. పూర్తిగా ఆరోగ్యం మెరుగుపడితే మంగళవారం ఉదయం డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది అని వైద్యులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'రేసు గుర్రం' షూటింగ్ లో శృతి హాసన్ పాల్గొన్నారు. అనంతరం ఎవడు యాప్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న శృతి హాసన్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు.