కెమెరా వెనుక నిలబడనున్న నటి!
ఏమీటి ఆది అంతం లేకుండా ఈ స్టార్ట్–కట్–ఒన్‌మోర్–ఓకే–పేకప్‌ల గొడవవేమిటన్నదే మీ సందేహం. పైన పదాలన్నీ సినీ పరిశ్రమలోని వారికి సుపరిచిత పదాలే. ముఖ్యంగా అందాల భామ శ్రుతీహాసన్‌కు బాగా పరిచయం. ఎందుకంటే తన కుటుంబమే ఒక విజయవంతమైన సినిమా. శ్రుతి సినిమాలోనే పుట్టి పెరిగిన నటి. అమ్మ, నాన్న, చెల్లెలు,పెదనాన్న ఇలా అందరికీ సినిమానే జీవితం. కాగా సరిగమలతో తెరంగేట్రం చేసిన శ్రుతీహాసన్ ఆ తరువాత నటనతో, గానంతో సుపరిచితురా
లయ్యారు.
ఇలా భారతీయ సినిమాలోనే తనకుంటూ చెరగని ముద్ర వేసుకున్న శ్రుతీహాసన్ పులి కడుపున పులిబిడ్డ కాకండా పిల్లి పుడుతుందా అనే స్థాయికి ఎదిగిపోయారు. ఆమె తండ్రి కమలహాసన్ సకలకళావల్లభుడని ఇప్పుడు ప్రత్యేకంగా ఉదహరించాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన వారుసురాలి అడుగులు అదే బాటలో పడుతున్నాయా?అవుననే అనిపిస్తోంది. శ్రుతీహాసన్ నటిగా, సంగీతదర్శకురాలిగా, గాయనిగా నిరూపించుకున్నారు. ఇవన్నీ తెర ముందు తెర వెనుక శాఖలు.తాజాగా కెమెరా వెనుక నిలబడనున్నారనే వార్త బలంగా వినబడుతోంది.
ఎస్.శ్రుతీహాసన్‌లో మంచి కథకురాలు కూడా ఉన్నారు. దాన్నిప్పుడు పదును పెట్టే పనిలో ఉన్నారట. అంతే కాదు మెగాఫోన్ పట్టి ఆ కథను తనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ శుభవార్తను శ్రుతి త్వరలోనే చెప్పబోతున్నారట. అప్పటి వరకూ ఎదురు చూద్దామా‘మొత్తం మీద ఇప్పటి వరకూ ఇతర దర్శకులు స్టార్ట్ యాక్షన్ అనగానే నటిస్తున్న శ్రుతీహాసన్ త్వరలో తనే స్టార్ట్ యాక్షన్ కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారన్న మాట.