అజిత్ 56వ చిత్రం ప్రారంభం | 'Thala 56' formally begins | Sakshi
Sakshi News home page

అజిత్ 56వ చిత్రం ప్రారంభం

Published Fri, Apr 10 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

అజిత్ 56వ చిత్రం ప్రారంభం

అజిత్ 56వ చిత్రం ప్రారంభం

 నటుడు అజిత్ 56వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆరంభం, వీరం, ఎన్నైఅరిందాల్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. ఆయనతో ఇంతకు ముందు ఆరంభం,ఎన్నైఅరిందాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసాయిరాం క్రియేషన్స్ అధినేత ఎఎం రత్రం మూడోసారి నిర్మిస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా ఇంతకుముందు అజిత్ హీరొగా వీరం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివ మరోసారి  ఆయనతో కలిసి ఈ చిత్రంలో పని చేయనున్నారు.
 
 ఈచిత్రంలో అజిత్ సరసన క్రేజీ నటి శ్రుతీహాసన్ నటించనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం. అయితే చిత్రవర్గాలు ఈవిషయాన్ని ద్రువీకరించలేదన్నది గమనార్హం.కాగా ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత భాణీలందించనుండటం మరో విశేషం. ఈ చిత్ర పూజాకార్యక్రమాలను గురువారం ఉదయం చెన్నైలో నిర్మాత నిర్మించిన శ్రీసాయిబాబా ఆలయంలో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement