నటి శ్రుతిపై ఆమె ఇంటి పనిమనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళంలో ‘కల్కి’ చిత్రంలో శ్రుతి నటించారు. అనేక కన్నడ చిత్రాల్లోనూ నటించారు. ఈమె కన్నడ చిత్ర దర్శకుడు
నటి శ్రుతిపై ఆమె ఇంటి పనిమనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళంలో ‘కల్కి’ చిత్రంలో శ్రుతి నటించారు. అనేక కన్నడ చిత్రాల్లోనూ నటించారు. ఈమె కన్నడ చిత్ర దర్శకుడు మహేంద్రన్‌ను వివాహమాడారు. ఇరువురి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో 2009లో విడాకులు తీసుకున్నారు. తర్వాత తన స్నేహితుడు చంద్రచూడ్‌ను శ్రుతి రెండోవివాహం చేసుకున్నారు. వీరి మధ్య కూడా వివాదం వచ్చి విడిపోయారు. ఇలావుండగా శ్రుతి ఇంట్లో పనిచేసే శోభ ఇటీవల బెంగుళూరు పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. అందులో శ్రుతి తనపై దాడి చేసి హింసించారని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన శ్రుతి నేరుగా బెంగళూరు పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ భర్త చంద్రచూడ్ ప్రోద్బలంతో శోభ తనపై ఫిర్యాదు చేసినట్లు, దీనికి తగిన కారణం తెలియదని వాపోయారు. దీనిపై విచారణ జరపాలని ఆమె కోరారు.