
అంత బాగా లేదు.. అందుకే ఒప్పుకోలేదు!
కథ చెప్పడం ఓ కళ. ఆ కళలో ఆరితేరినవాళ్లు ఎంత పేలవమైన కథను అయినా చాలా ఆసక్తికరంగా చెబుతారు. ఆ కథ వినగానే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు హీరో, హీరోయిన్లు. అలా కాకుండా కొంచెం కథ విని, పచ్చజెండా ఊపేసేవాళ్లూ ఉంటారు. ఇటీవల హిందీ దర్శకుడు మిలన్ లూథ్రియా చెప్పిన కొంచెం కథ విని, శ్రుతీహాసన్ నటించడానికి అంగీకరించారట. అజయ్ దేవగన్ హీరోగా ఆయన ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. కాగా, ఓసారి పూర్తి కథ వినండంటూ ఇటీవల శ్రుతికి ఆయన ఫైనల్ స్క్రిప్ట్‌ని వినిపించారట. ముందు విన్న కొంచెం కథలో తన పాత్ర ఉన్నంత బాగా ఫైనల్ స్క్రిప్ట్‌లో లేదని శ్రుతికి అనిపించిందని సమాచారం. దాంతో ఈ చిత్రంలో నటించాలనే ఆలోచనను విరమించుకున్నారని బాలీవుడ్ టాక్.