
శ్రుతి మొదటి బాయ్‌ఫ్రెండ్ ఎవరు?
సాధారణంగా కథానాయికలు తమ బాయ్‌ఫ్రెండ్‌ల గురించి చెప్పరు. అలాంటిది తొలిబాయ్‌ఫ్రెండ్ ఎవరంటే ఆగ్రహంగో ఊగిపోతారు. అలాంటిది నటి శ్రుతిహాసన్ రూటేవేరు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. సహ నటీమణులతో సహజంగా మెలుగుతారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషానటిగా వెలుగొందుతున్న నటి శ్రుతి.
ఈమె బాయ్‌ఫ్రెండ్స్ అంటూ సినీ వర్గాలు చాలా మందితో కలిపి వదంతులు ప్రచారం చేశారు. వారిలో నటుడు సిద్ధార్థ్ పేరు కూడా చోటు చేసుకుంది. అయితే అలాంటి ప్రచారం గురించి శ్రుతిహాసన్ అస్సలు పట్టించుకోరు. అసలు పెళ్లే చేసుకోను అని ధైర్యంగా చెప్పిన నటి శ్రుతి. ఎలాంటి ప్రశ్నలకైనా తడుముకోకుండా బదులిచ్చి అడిగిన వాళ్లను ఔరా అనిపించగల చాతుర్యం ఈ బ్యూటీకి ఉంది.
గ్లామర్ గురించి అభిప్రాయం చెప్పమన్న వాళ్లతో అసలు గ్లామరంటే అర్థం ఏమిటని ప్రశ్నించిన నటి శ్రుతి. అలాగే మీ తొలి బాయ్‌ఫ్రెండ్ ఎవరన్న ప్రశ్నకు ఏ మాత్రం సంకోచించకుండా తను ఒక సంగీత దర్శకుడని తెలిపారు. ఆయన మంచి ప్రతిభావంతుడని, మర్యాదస్తుడని అన్నారు. సాధారణంగా హీరోయిన్లు తమ బాయ్‌ఫ్రెండ్స్ గురించి బహిరంగంగా చెప్పరని,తాను మాత్రం ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలినన్నారు.
తానేమిటో తెలిసిన వారు తన గురించి తప్పుగా భావించరని అన్నారు. ఇంతకీ తన తొలి బాయ్‌ఫ్రెండ్ ఒక సంగీతదర్శకుడని చెప్పారేగానీ ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు శ్రుతి. ప్రస్తుతం ఈ బ్యూటీ తన తండ్రితో కలిసి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నారు.సూర్య సరసన నటిస్తున్న ఎస్-3 చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అదే విధంగా తెలుగులో నాగచైతన్యకు జంటగా ప్రేమమ్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో మరో సారి పవన్‌కల్యాణ్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.