వృద్ధురాలిగా శ్రుతీహాసన్
Published Sat, Mar 15 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM
చిన్న వయసులో ముసలి పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాగే, వయసు పైబడిన తర్వాత యవ్వనంగా కనిపించడమూ సులువు కాదు. అందుకే, ఈ తరహా పాత్రలను తారలు సవాల్‌గా తీసుకుంటారు. ప్రస్తుతం శ్రుతీహాసన్ కూడా ఈ సవాల్‌కి సిద్ధపడ్డారు. ‘బిచ్‌డీ సభీ బారీ బారీ’ పేరుతో రూపొందనున్న చిత్రంలో ఆమె రెండు పాత్రలు చేయనున్నారు. పాన్ సింగ్ తోమ, సాహెబ్ బీవీ గ్యాంగ్‌స్టర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన తిగ్‌మాన్షు ధూలియా ఈ చిత్రం రూపొందించనున్నారు.
1979 నుంచి 2014 మధ్యకాలంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. స్నేహితులుగా మనోజ్ బాజ్‌పాయ్, ఇర్ఫాన్ ఖాన్ నటించనున్నారు. ఆ స్నేహితులకు, శ్రుతి పాత్రకు లింకేంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో శ్రుతిహాసన్ నేటి తరం అమ్మాయిగా, వృద్ధురాలి పాత్రలో కూడా కనిపించనున్నారు. అదొక విశేషం అయితే, ఈ సినిమాలో శ్రుతి చేసే రెండు పాత్రలు మినహా వేరే ఆడపాత్రలేవీ ఉండకపోవడం మరో విశేషం. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
Advertisement
Advertisement