మరోసారి బాలీవుడ్ చాన్స్ | Kajal Agarwal Once again Bollywood Chance | Sakshi
Sakshi News home page

మరోసారి బాలీవుడ్ చాన్స్

Published Wed, Jul 30 2014 11:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మరోసారి బాలీవుడ్ చాన్స్ - Sakshi

మరోసారి బాలీవుడ్ చాన్స్

 భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో మనిషి జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండేవారన్నది అంతే సత్యం. కాజల్ అగర్వాల్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఉత్తరాది భామ తొలి రోజుల్లో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదగడానికి పెద్ద పోరాటమే చేశారు. ఇక్కడ ఆశ్రయం లభించినా ఆదరించింది మాత్రం టాలీవుడ్ అనే చెప్పాలి. అక్కడ మగధీర చిత్రం కాజల్‌ను టాప్ హీరోయిన్ స్థాయికి చేర్చింది. ఆ తరువాతనే కోలీవుడ్‌లో విజయాల ఖాతా ఓపెన్ అయింది.
 
 ఇలా రెండు భాషలలో ప్రముఖ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. దీంతో దక్షిణాదిలో సమంత, శ్రుతిహాసన్ వంటి కొత్త హీరోయిన్లు ఆమె స్థానాన్ని భర్తీ చేశారు. అటు బాలీవుడ్‌లోను కాజల్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. దీంతో మళ్లీ దక్షిణాది చిత్రాలపై దృష్టిసారిం చారు. ఇక్కడ మళ్లీ తన స్థానాన్ని కైవసం చేసుకోవాలనే విశ్వ ప్రయత్నంలో పడ్డారు. దీంతో పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధం అయినట్లు సమాచారం.
 
 అంతేకాదు స్టార్ హీరోలకు ఫోన్ చేసి తాను ఖాళీగా ఉన్నానంటూ వారికి సంకేతాలిస్తున్నారు. పరోక్షంగా అవకాశాలివ్వండని అడుగుతున్నారట. అయితే ఈ బ్యూటీకి తాజాగా బాలీవుడ్‌లో మరోసారి అదృష్టం పరీక్షించుకునే అవకాశం కూడా వచ్చిందని తెలిసింది. ఔరా దేవదాస్ చిత్రంలో చిత్రాంగధ సింగ్ నటించాల్సిన అవకాశం కాజల్ అగర్వాల్‌ను వరించినట్లు సమాచారం. అయితే ఈ పరిస్థితిలో దక్షిణాదిలో కాజల్ అవకాశాలను కొట్టేయడానికి ఇక్కడ హీరోయిన్లు రెడీ అవుతున్నారని కోలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement