షారుక్‌తో రొమాన్స్‌ ఈజీ: నటి | Anushka Sharma says it's easy to romance Shah Rukh Khan onscreen | Sakshi
Sakshi News home page

షారుక్‌తో రొమాన్స్‌ ఈజీ: నటి

Published Thu, Jul 27 2017 11:44 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

షారుక్‌తో రొమాన్స్‌ ఈజీ: నటి

షారుక్‌తో రొమాన్స్‌ ఈజీ: నటి

బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌తో ఆన్‌ స్క్రీన్‌ రోమాన్స్‌ చేయడం సులభం అని బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ అభిప్రాయపడింది. అతని కళ్లలో నిజాయితీ కనబడుతుందని అది మనం స్క్రీన్‌పై చూడవచ్చని, షారుక్‌ చివరికి మైక్రోఫోన్‌తో కూడా రొమాన్స్‌ చేయగలడని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. దీనికి షారుక్‌ నువ్వు మైక్‌ పట్టుకున్నంత కాలం రొమాన్స్‌ చేయగలను డార్లింగ్‌ అని రిప్లే ఇచ్చాడు.

రబ్‌ నే బనా దీ జోడీ(2008), జబ్‌ తక్‌ హై జాన్‌ (2012) చిత్రాల్లో నటీనటులుగా నటించిన షారుక్‌, అనుష్కా జంట అప్‌కమింగ్‌ చిత్రం ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’  తో ఆగష్టు 4 న ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే. చిత్రంలోని  హావాయిన్‌ సాంగ్‌ను షారుక్‌, అనుష్కలు విడుదల చేశారు. ఈ పాటలో హ్యారీ అండ్‌ సెజల్‌ మధ్య మంచి రొమాన్స్‌ ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ బాలీవుడ్‌ నటులు.  షారుక్‌ తన ఇన్‌ స్ట్రాగ్రమ్‌లో పోస్టు చేయగా,  అనుష్కా మ్యూజిక్‌ కంపోజర్‌ ప్రీతమ్‌తో రిలీజ్‌ చేసింది. తనను కేవలం ప్రేమకథా చిత్రాలకే అభిమాని అని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రేమతో పాటు కామెడీ సినిమాలను కూడా ఇష్టపడుతానని షారుక్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement