‘ఆరోజులు మళ్లీ తిరిగిరావు’ | Anushka Sharma Shares Adorable Pic | Sakshi
Sakshi News home page

‘ఆరోజులు మళ్లీ తిరిగిరావు’

Published Sat, Oct 27 2018 2:28 PM | Last Updated on Sat, Oct 27 2018 2:29 PM

Anushka Sharma Shares Adorable Pic - Sakshi

‘చిన్నతనంలో.. ఫొటోకు ఫోజివ్వమన్నపుడు మన హావభావాలు ఇలాగే ఉంటాయేమో కదా. ఆనాటి అందమైన ఙ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ.. తన స్కూల్‌ ఫ్రెంఢ్స్‌తో కలిసి ఉన్న అరుదైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. అనుష్క ఫొటోకు ఫిదా అయిన అభిమానులు.. ‘మీరు చెప్పింది నిజమే.. చిన్ననాటి ఙ్ఞాపకాలు అరుదైనవి. ఆ రోజులు మళ్లీ తిరిగిరావు.. మా స్కూల్‌డేస్‌ను మిస్సవుతున్నాం’  అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

కాగా ఆర్మీ కుటుంబంలో జన్మించిన అనుష్క బెంగళూరులోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ముంబై చేరుకుని మెడలింగ్‌ రంగంలో ప్రవేశించారు. అనతికాలంలోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అనుష్క నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘జీరో’ షూటింగ్‌లో ఆమె బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement