
స్వచ్ఛమైన ప్రేమ
భిన్నమైన నేపథ్యాలు, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ప్రిన్ ్స, వ్యోమనంది, పూజా రామచంద్రన్ ప్రధానపాత్రల్లో వాణి యం. కొసరాజు దర్శకత్వంలో శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలవుతోంది.
దర్శకురాలు మాట్లాడుతూ- ‘‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. ఈ తరంలో అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారని అంటున్నారు. అవసరమైతే ప్రేమ కోసం అమ్మాయిలు త్యాగాలు చేస్తారు. ఇదే విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.సురేశ్‌బాబు, శ్రీనివాస్ వూడిగ.