
అది అత్యాచారం కాదు: హైకోర్టు
న్యూఢిల్లీ: వివాహానికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత పురుషుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని అతనిపై అత్యాచారం కేసు పెడితే అది చెల్లదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. శృంగారం తర్వాత ఎదురయ్యే పరిణామాలపై స్త్రీకి పూర్తి అవగాహన ఉంటుందనీ, ఆమెను పెళ్లి చేసుకోవచ్చు లేదా నిరాకరించవచ్చని తెలిసినా కలయికకు ఒప్పుకోవడం ఆమె తప్పే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిపై 26 ఏళ్ల మహిళ ఇలాంటి కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో రెండుసార్లు శృంగారం చేశాక, ఇప్పడు పెళ్లికి ఒప్పుకోవడం లేదనీ, ఫోన్ లో కూడా మాట్లాడటం లేదని ఆమె ఆరోపించింది.