సల్మాన్ సరసన అనుష్క
ఎట్టకేలకు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'సుల్తాన్' కు హీరోయిన్ కన్ఫాం అయింది . బాలీవుడ్ లో ఉత్కంఠను రేపిన ఆ పాత్రను చివరకు పీకే స్టార్ అనుష్క శర్మ ఎగరేసుకుపోయింది.
ముంబై: ఎట్టకేలకు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'సుల్తాన్' కు హీరోయిన్ కన్ఫాం అయింది . బాలీవుడ్ లో ఉత్కంఠను రేపిన ఆ పాత్రను చివరకు పీకే స్టార్ అనుష్క శర్మ ఎగరేసుకుపోయింది. ఈ విషయాన్ని యష్ రాజ్ ఫిలింస్ అధికారిక ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఈ విషయాన్ని అఫీషియల్గా వెల్లడించారు. దీంతోపాటు సల్మాన్ అనుష్కల ఫోటోను కూడా షేర్ చేశారు. దీనికి దబాంగ్ హీరో సల్మాన్,(50) పీకే భామ అనుష్క(27) రీ ట్విట్ చేశారు. దీంతో సల్మాన్ జోడీగా ఎవరు నటించనున్నారనే ఊహాగానాలకు తెరపడింది.
దాదాపు సగం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఇంతవరకు కథానాయిక ఫైనల్ కాకపోవడం బీ టౌన్ లో ఆసక్తికరంగా మారింది. ఈ క్యారెక్టర్ కోసం పరిణితీ చోప్రా, కంగనారనౌత్, క్రితి సనన్ ,దీపికాపదుకొనే కత్రినా లాంటి టాప్ హీరోయిన్ల పేర్లతో పాటు, టీవీ నటి మృణాల్ పేరు కూడా హల్చల్ చేసినా ఫైనల్ కాలేదు. . చివరికి తాజా ట్విట్తో క్లారిటీ వచ్చినట్టయింది.
కాగా హరియాణాకు చెందిన 40 ఏళ్ల రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ''సుల్తాన్''. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై, అబ్బాస్ ఆలీ జఫర్ దర్శకత్వంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2016 ఈద్కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
2008 లో యశ్ రాజ్ ఫిలింస్ మూవీ రబ్ నే బనా దీ జోడీ తో బాలీవుడ్ రంగప్రవేశం చేసిందీ అనుష్మ శర్మ. జబ్ తక్ హై జాన్ , ఎన్ హెచ్ 10, బాంబే వెల్వెట్, పీకే తదితర సినిమాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకుంది. గత ఏడాది ఈ అమ్మడు నిర్మాతగా తొలి అడుగులు వేసింది. పెటా సంస్థ హాటెస్ట్ విజెటేరియన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డునందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ కొత్త ఏడాదిలో ఎలాంటి మెరుపులు మెరిపించనుందో చూడాలి.