తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి | Virat Kohli Reveals Through Twitter That We Are Getting Son In January 2021 | Sakshi
Sakshi News home page

తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి

Published Thu, Aug 27 2020 11:30 AM | Last Updated on Thu, Aug 27 2020 1:54 PM

Virat Kohli Reveals Through Twitter That We Are Getting Son In January 2021 - Sakshi

ఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విటర్‌ వేదికగా అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు.'ప్రస్తుతం నా భార్య గర్భవతి..త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు.. అది అబ్బాయా లేక అమ్మాయా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు నేను పుత్రోత్సాహం అనుభవిస్తున్నా.. మా ఆరేళ్ల రిలేషిన్‌షిప్‌లో ది మోస్ట్‌ మొమరబుల్‌ మూమెంట్‌ ఇదే.. ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నాం.' అంటూ పేర్కొన్నాడు. కాగా ట్విటర్‌లో విరాట్‌ తన భార్య అనుష్క శర్మతో లేటెస్ట్‌గా దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2013 నుంచి రిలేషిన్‌షిప్‌లో విరుష్క జోడి.. 2017లో ఇటలీలో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు. (చదవండి : ఆసిఫ్‌.. ఇంత కోపం పనికిరాదు)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement