కోహ్లి.. నా ఆటోగ్రాఫ్‌ కావాలా? | Anushka Smiles As Virat Kohli Takes Autograph Of 7 Year Old | Sakshi
Sakshi News home page

కోహ్లి.. నా ఆటోగ్రాఫ్‌ కావాలా?

Published Tue, Sep 3 2019 6:19 PM | Last Updated on Tue, Sep 3 2019 6:34 PM

Anushka Sharma Smiles As Virat Kohli Takes Autograph Of 7-Year-Old Fan In Jamica - Sakshi

జమైకా : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌ల కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తుంటారు. కానీ ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం ఇందుకు విరుద్ధంగా తన ఆటోగ్రాఫ్‌ తీసుకుంటారా అని విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మకు షాకిచ్చాడు. 

కరీబియన్‌ పర్యటనకు కోహ్లితో పాటు అనుష్కశర్మ వెళ్లిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ పర్యటన సమయంలో వీలు దొరికినప్పుడల్లా కరీబియన్‌ అందాలను ఆస్వాదించారు. ఈ క్రమంలో విరాట్‌ దంపతులు తమ విహార యాత్రలో భాగంగా ఓ చోటుకు వెళ్లారు. అక్కడ వారిని గుర్తించిన ఓ బాలుడు వెంటనే వారి దగ్గరికి వెళ్లి ' నా ఆటోగ్రాఫ్‌ కావాలా' అని అడగడంతో  కోహ్లి, అనుష్కలు అవాక్కయ్యారు. వెంటనే విరాట్‌, అనుష్కలు నవ్వుతూ ఆ బాలుడి ఆటోగ్రాఫ్‌ను  తీసుకొని ఆ చిన్నారిని ఆనందంలో ముంచెత్తారు.

''జమైకాలో జరిగిన రెండో టెస్టు చూడడానికి వెళ్లిన నా ఏడేళ్ల మేనళ్లుడు విరాట్‌ కోహ్లిని బయట కలుసుకొని ' నా ఆటోగ్రాఫ్‌ కావాలా అని అడిగిన వెంటనే విరాట్‌, అనుష్కలు ఆగిపోయి ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడం" సంతోషం కలిగించిందని పిల్లాడి మామయ్య అమిత్‌ లక్ష్మీ వీడియోనూ ట్వీట్‌ చేయడం వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement