సూపర్‌స్టార్‌కు జంటగా దీపికాపదుకొనే | Deepika Padukone to romance with Mahesh Babu | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌కు జంటగా దీపికాపదుకొనే

Published Mon, May 2 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

సూపర్‌స్టార్‌కు జంటగా దీపికాపదుకొనే

సూపర్‌స్టార్‌కు జంటగా దీపికాపదుకొనే

  షారూక్‌ఖాన్, రణ్‌బీర్‌కపూర్ లాంటి బాలీవుడ్ బడా హీరోలతో నటిస్తున్న ఉత్తరాది క్రే జీ హీరోయిన్ దీపికాపదుకొనే దక్షిణాదిలో ఒకే ఒక్క చిత్రంలో నటించారు. అదీ దక్షణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా కోచ్చయడైయాన్ అనే 3డీ యానిమేషన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ ముద్దుగుమ్మ మరోసారి దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు తమిళంలో సూపర్‌స్టార్ సరసన నటించిన దీపికాపదుకొనే ఈ సారి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో రొమాన్స్‌కు సై అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
 
 అసలు విషయం ఏమిటంటే మహేశ్‌బాబు, దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ల కలయికలలో ఒక భారీ చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ హీరోగా కత్తి చిత్రాన్ని రూపొందించిన ఏఆర్.మురుగదాస్ ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లి అకిరా అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాక్షీసిన్హా కథానాయకిగా నటించిన ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబరులో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తదుపరి మురుగదాస్ అజిత్ హీరోగా చిత్రం చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.అలాంటిది తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చిత్రం ముందుకు రావడం విశేషం.
 
 తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్న అంశం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది.ఇంతకు ముందు నటి కీర్తీసురేశ్ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ భామ తెలుగులోకి అడుగు పెట్టే చిత్రం ఇదే అవుతుంది. మహేశ్‌బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రాన్ని పూర్తి చేసేపనిలో ఉన్నారు.ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించే తాజా చిత్రం వచ్చే నెల ప్రారంభం కానుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement