''మ్యాచ్ కి ముందు క్రికెటర్లు శృంగారం చేస్తే మైదానంలో మెరుగైన ప్రదర్శన చేస్తారు''.. ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయా. సరిగ్గా పదేళ్ల క్రితం టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ ఆడుతున్న సమయంలో అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు మరోసారి ప్యాడీ ఆప్టన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు శృంగారంలో పాల్గొంటే మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇస్తారని ఒక భారతీయ డాక్టర్ ఇచ్చిన సలహా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే.. ప్రముఖ ఇండియన్ సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కొటారీ ఒక న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు సమాచారం. ఏ అథ్లెట్ అయినా తన మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం వస్తుందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. సైంటిఫిక్‌గానూ ఇది ప్రూవ్ అయింది. నా స్నేహితుడు.. వరల్డ్ ఫేమస్ యూఎస్ సెక్సాలజిస్ట్ వార్డెల్ పోమొరాయ్ కూడా చాలా ఇంటర్య్వూల్లో ఇదే చెప్పాడు.
కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు రోజు తమ జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నారని.. తెల్లావారితే జరిగిన మ్యాచ్‌ల్లో గోల్డ్ మెడల్స్ కైవసం చేసకున్నట్లు పేర్కొన్నాడు. శృంగారం అనేది ఒక పవర్ బూస్టర్ అని.. ఆటగాళ్లు ట్రై చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఆటపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని ప్రకాశ్ కొటారీ తెలిపాడు.
ఇదే విషయమై మరో ఇండియన్ సెక్సాలజిస్ట్ డాక్టర్ సంజయ్ దేశ్‌పాండే మాత్రం మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుందని క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం జరగలేదన్నారు. లైంగిక సంపర్కం తర్వాత క్రీడలలో ఆటగాళ్లు చూపించయిన పనితీరుపై ఎక్కడా ఎటువంటి పరిశోధనలు జరగలేదు అని తెలిపారు.
పదేళ్ల క్రితమే ప్యాడీ ఆప్టన్ 2011లో ధోనీ నేతృత్వంలో భారత్ వరల్డ్ కప్ గెలుచుకున్న సమయంలోనే ఈ విషయాన్ని పేర్కొన్నాడు. మ్యాచ్ లో భయం పోవాలంటే ఇలా చేయొచ్చని ఆనాటి కోచ్ గ్యారీ కిర్ స్టెన్ కు చెప్పగా ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని ప్యాడీ తన ఆత్మకథ ‘ది బేర్ ఫూట్ కోచ్’ అనే పుస్తకంలో రాసుకొచ్చాడు. 2009 చాంపియన్స్ ట్రోఫీకి ముందు రెడీ చేసిన నోట్స్ లోనూ శృంగారం వల్ల లాభాల గురించి సవివరంగా రాసుకొచ్చినట్టు తెలిపాడు.
కోచ్ గా ఉన్న సమయంలో తాను ఏమేం సలహాలిచ్చాడో అన్నింటినీ పుస్తకంలో వెల్లడించాడు. 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్, ధోనీ సహా.. టీమిండియా సమిష్టికృషితో ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా ప్యాడీ ఆప్టన్‌ను ఈ ఏడాది వెస్టిండీస్ పర్యటనకు ముందు మరోసారి మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment