Asia Cup, 2023 - Pakistan vs India, Super Fours Updates:
పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం
ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఘోర పరాజయం పాలైంది. పాకిస్తాన్ 32 ఓవర్లలోనే 128 పరుగులకు ఆలౌటైంది. పాక్‌పై 228 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పాక్
పాకిస్తాన్ జట్టు 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఆఘా సల్మాన్ (23) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 24 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 96/5గా ఉంది.
పాక్ నాలుగో వికెట్ డౌన్
పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్ (27) క్లీన్ బౌల్డయ్యాడు. 20 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 79/4గా ఉంది. అఘా సల్మాన్ (13), ఇఫ్తికార్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన పాక్
వర్షం తగ్గాక శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో బంతికే పాక్ మూడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ రిజ్వాన్ (2) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 47/3. ఫకర్ జమాన్ (15), అఘా సల్మాన్ క్రీజ్‌లో ఉన్నారు.
తగ్గిన వర్షం.. కాసేపట్లో తిరిగి మొదలుకానున్న ఆట
వరుణుడు శాంతించాడు. 9:20 గంటలకు ఆట తిరిగి ప్రారంభంకానుంది. ఓవర్ల కోత లేకుండా ఈ మ్యాచ్ 50 ఓవర్ల పాటు కొనసాగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం మళ్లీ అంతరాయం కలిగిస్తే అప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం రివైజ్డ్ టార్గెట్స్ ఇలా ఉంటాయి..
20 ఓవర్లలో 200 పరుగులు
22 ఓవర్లలో 216
24 ఓవర్లలో 230
26 ఓవర్లలో 244
ఈ మ్యాచ్‌లో ఫలితం రావాలంటే పాక్ కనీసం 20 ఓవర్లయినా ఆడాలి.
పాక్‌కు షాక్.. కెప్టెన్ క్లీన్ బౌల్డ్
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను హార్దిక పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 44/2గా ఉంది. మహ్మద్ రిజ్వాన్ (1), ఫకర్ జమాన్ (14) క్రీజ్‌లో ఉన్నారు.
WHAT A BALL FROM HARDIK...!!!
— Johns. (@CricCrazyJohns) September 11, 2023
He cleans up world number 1 ODI batter. pic.twitter.com/cLNfRlv3Sr
టార్గెట్ 357.. తొలి వికెట్ కోల్పోయిన పాక్
357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాక్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఇమామ్ ఉల్ హాక్ (9) ఔటయ్యాడు. 4.2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 17/1గా ఉంది. ఫకర్ జమాన్, బాబర్ ఆజమ్ క్రీజ్‌లో ఉన్నారు.
రాహుల్, కోహ్లి శతకాల మోత.. టీమిండియా భారీ స్కోర్
కేఎల్ రాహుల్ (111 నాటౌట్), విరాట్ కోహ్లి (122 నాటౌట్) శతకాలతో విరుచుకుపడటంతో టీమిండియా పాక్‌పై భారీ స్కోర్ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్ (56), శుభ్‌మన్ గిల్ (58) కూడా హాఫ్ సెంచరీలు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్
రాహుల్ శతక్కొట్టిన మరుసటి ఓవర్‌లోనే విరాట్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. 47.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 322/2.
రీఎంట్రీలో శతక్కొట్టిన కేఎల్ రాహుల్
గాయం నుంచి కోలుకుని దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ వచ్చీరాగానే సెంచరీతో సత్తా చాటాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ 100 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లి సైతం సెంచరీకి దగ్గర పడ్డాడు. అతను ప్రస్తుతం 81 బంతుల్లో 97 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
సెంచరీల దిశగా దూసుకెళ్తున్న రాహుల్, విరాట్
అర్ధసెంచరీలు పూర్తి చేసుకునేంతవరకు ఆచితూచి ఆడిన రాహుల్, విరాట్‌లు ఆతర్వాత గేర్ మార్చారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడం మొదలుపెట్టారు. రాహుల్‌తో పోలిస్తే విరాట్ వేగం మరింత పెంచాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 286/2గా ఉంది. కోహ్లి (71 బంతుల్లో 80), రాహుల్ (92 బంతుల్లో 84) క్రీజ్‌లో ఉన్నారు.
అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి
ఆచితూచి ఆడుతున్న విరాట్ కోహ్లి 55 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 243/2గా ఉంది. రాహుల్ (71), కోహ్లి (50) క్రీజ్‌లో ఉన్నారు.
35 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225/2. రాహుల్ 63, కోహ్లి 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్
33.1: పహీహ్ అష్రఫ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రాహుల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
జోరు పెంచిన రాహుల్.. బాధ్యతగా ఆడుతున్న కోహ్లి
ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఆట మొదలైంది. ఆదివారం వర్షం కారణంగా 24.2 ఓవర్ల దగ్గర ఆగిపోయిన ఆటను సోమవారం(రిజర్వ్ డే) ఆట ప్రారంభించిన (147/2) టీమిండియా తొలుత కాస్త నిదానంగా ఆడింది. అయితే, ఆతర్వాత జోరుపెంచి వేగంగా పరుగులు రాబడుతోంది.
ముఖ్యంగా రాహుల్ (42) గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తుండగా, కోహ్లి (22) బాధ్యతగా ఆడుతున్నాడు. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 186/2గా ఉంది. వర్షం కారణంగా నిన్న రద్దైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన ఇవాళ ఎట్టకేలకు ప్రారంభమైంది. వరుణుడు శాంతించడంతో ఈ మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా సాగనుంది.
నిన్న టీమిండియా ఎక్కడైతే ఇన్నింగ్స్‌ను ముగించిందో అక్కడి నుంచే ఇవాళ ప్రారంభిస్తుంది. నిన్న వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత్ స్కోర్ 24.1 ఓవర్లలో 147/2గా ఉండింది. రోహిత్ (56), గిల్ (58) ఔట్ కాగా.. కోహ్లి (8), రాహుల్ (17) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment