Indian doctors
-
మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మెరుగైన ప్రదర్శన!
''మ్యాచ్ కి ముందు క్రికెటర్లు శృంగారం చేస్తే మైదానంలో మెరుగైన ప్రదర్శన చేస్తారు''.. ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయా. సరిగ్గా పదేళ్ల క్రితం టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ ఆడుతున్న సమయంలో అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు మరోసారి ప్యాడీ ఆప్టన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు శృంగారంలో పాల్గొంటే మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇస్తారని ఒక భారతీయ డాక్టర్ ఇచ్చిన సలహా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ప్రముఖ ఇండియన్ సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కొటారీ ఒక న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు సమాచారం. ఏ అథ్లెట్ అయినా తన మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం వస్తుందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. సైంటిఫిక్‌గానూ ఇది ప్రూవ్ అయింది. నా స్నేహితుడు.. వరల్డ్ ఫేమస్ యూఎస్ సెక్సాలజిస్ట్ వార్డెల్ పోమొరాయ్ కూడా చాలా ఇంటర్య్వూల్లో ఇదే చెప్పాడు. కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు రోజు తమ జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నారని.. తెల్లావారితే జరిగిన మ్యాచ్‌ల్లో గోల్డ్ మెడల్స్ కైవసం చేసకున్నట్లు పేర్కొన్నాడు. శృంగారం అనేది ఒక పవర్ బూస్టర్ అని.. ఆటగాళ్లు ట్రై చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఆటపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని ప్రకాశ్ కొటారీ తెలిపాడు. ఇదే విషయమై మరో ఇండియన్ సెక్సాలజిస్ట్ డాక్టర్ సంజయ్ దేశ్‌పాండే మాత్రం మ్యాచ్‌కు ముందు శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుందని క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం జరగలేదన్నారు. లైంగిక సంపర్కం తర్వాత క్రీడలలో ఆటగాళ్లు చూపించయిన పనితీరుపై ఎక్కడా ఎటువంటి పరిశోధనలు జరగలేదు అని తెలిపారు. పదేళ్ల క్రితమే ప్యాడీ ఆప్టన్ 2011లో ధోనీ నేతృత్వంలో భారత్ వరల్డ్ కప్ గెలుచుకున్న సమయంలోనే ఈ విషయాన్ని పేర్కొన్నాడు. మ్యాచ్ లో భయం పోవాలంటే ఇలా చేయొచ్చని ఆనాటి కోచ్ గ్యారీ కిర్ స్టెన్ కు చెప్పగా ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని ప్యాడీ తన ఆత్మకథ ‘ది బేర్ ఫూట్ కోచ్’ అనే పుస్తకంలో రాసుకొచ్చాడు. 2009 చాంపియన్స్ ట్రోఫీకి ముందు రెడీ చేసిన నోట్స్ లోనూ శృంగారం వల్ల లాభాల గురించి సవివరంగా రాసుకొచ్చినట్టు తెలిపాడు. కోచ్ గా ఉన్న సమయంలో తాను ఏమేం సలహాలిచ్చాడో అన్నింటినీ పుస్తకంలో వెల్లడించాడు. 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్, ధోనీ సహా.. టీమిండియా సమిష్టికృషితో ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా ప్యాడీ ఆప్టన్‌ను ఈ ఏడాది వెస్టిండీస్ పర్యటనకు ముందు మరోసారి మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా తీసుకొచ్చింది. చదవండి: ఔట్ కాదనుకుంటా.. పాల్ స్టిర్లింగ్ మోసపోయాడు -
డ్యాన్స్‌తో ఇరగదీసిన భారతీయ వైద్యులు
ఉల్లాసం.. ఉత్సాహం అరవై మంది భారతీయ యువ వైద్యులు 2013 నాటి ఫరేల్ విలియం ఉల్లాస గీతం ‘హ్యాపీ’ ని అనుకరిస్తూ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ఈ కరోనా సమయంలో మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మీకు గుర్తు చేయడానికే మేమున్నాం. రేపటి సూర్యోదయం మన కోసం మరింత ప్రకాశవంతంగా ఉంటుందన్న ఆశతో..’ అంటూ ముంబై, పుణె, ఢిల్లీ, నాగపుర్, కన్యాకుమారి, ఇంకా వివిధ నగరాల్లోని వైద్యులు ఈ వీడియోలో ఆకాంక్షించారు. వాళ్లేమీ పాడరు, మాట్లాడరు. ఎక్కడి వాళ్లక్కడే ఊరికే డాన్స్ చేస్తుంటారు. ఆ డాన్స్లన్నిటి కూర్పే.. ఈ సాంగ్ ఆఫ్ హోప్. ఆశలు కోల్పోకండి. సంతోషంగా ఉండండి అని చెప్పడమే ఉద్దేశం. తప్పు తప్పే పోషా కారు నడుపుతున్నాడు కుర్రాడు. కారుకు దీటుగా ఉన్నాడు. లాక్డౌన్లో ఎందుకో బయటికి వచ్చాడు. ‘ఎందుకో కాదు. ఖాళీ రోడ్లపై విహరించేందుకు వచ్చాడు చిన్నినాయన’ అంటున్నారు స్పెషల్ ఫోర్స్ వాళ్లు. కలవారి అబ్బాయి. మధ్యప్రదేశ్‌లో పెద్ద బిజినెస్‌మేన్ కొడుకు. మామూలు పోలీసులైతే పోనీలే అనుకుని వదిలేసేవారేమో. ఆపింది ఇండోర్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్. కారును పక్కన పెట్టించి రోడ్డు మీద గుంజీళ్లు తీయించాడు. పాస్ చూపిస్తున్నా వదల్లేదని కుర్రాడి తండ్రి ఆరోపణ. దీనిపై వెంటనే ఇండోర్ ఎఎస్పీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ‘పాస్ వుంది నిజమే. మాస్క్ లేదు’ అని ఆయన సమాధానం! పక్కపక్క వార్డులు తల్లికి కరోనా పాజిటివ్. ఆమె జన్మనిచ్చిన బిడ్డకు కరోనా నెగటివ్. ఇద్దర్నీ వేర్వేరు వార్డుల్లో ఉంచారు. బిడ్డను తాకడానికి, కనీసం చూసుకోడానికి లేదు. ఏప్రిల్18న పుట్టింది బిడ్డ. ఆరోజు నుంచి.. వైద్యులు ఏర్పాటు చేసిన వీడియో కాల్ లోనే బిడ్డను చూసుకుని సంతృప్తి పడుతోంది ఆ తల్లి. ఔరంగాబాద్ సివిల్ ఆసుపత్రిలో (మహారాష్ట్ర) ఆమెకు సిజేరియన్ జరిగింది. స్పృహలోకి రాగానే బిడ్డను చూపించమని బతిమాలింది. ‘‘ఇప్పుడొద్దమ్మా..’’ అన్నారు. వైద్యులకూ చూపించాలనే ఉంది కానీ, కరోనా వార్డులోకి బిడ్డను తీసుకెళ్లడం, కరోనా వార్డు నుంచి తల్లి రావడం రెండూ ప్రమాదమే అని నచ్చజెప్పారు. సోషల్ మీడియాలో కొందరు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ‘‘దేవుడా.. ఈ తల్లీ బిడ్డల్ని వేరు చేయకు’’ అని వేడుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. -
అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు
అట్లాంటా : అమెరికాలోని అట్లాంటా మహానగరంలో ఆషియన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫీజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపి) 37వ వార్షిక సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు సుమారు మూడువేల మందికిపైగా హాజరయ్యారు. అమెరికాలోని వివిధ నగరాల నుంచి వైద్యులు వారి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. ఆపి అమెరికాలో అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన భారతీయ వైద్యుల సంఘం. అమెరికాలోని ఈ వైద్యుల సంఘం భారత దేశంలోనూ, అమెరికాలోను అనేకమైన వైద్య సేవలను అందిస్తోంది. ఆపి సంస్థ భారత ప్రభుత్వంతోను, అనేక రాష్ట్రాలతోనూ అనేక స్వచ్చంద సంస్థలతోను ఒప్పందాలు చేసుకుని విరివిగా భారత దేశంలో వైద్య సేవలను అందిస్తోంది. ఆపి 37వ వార్షిక సదస్సు జులై 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో.. మహబూబ్‌నగర్ మూలాలు కలిగిన అట్లాంటా ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ గంగసాని శ్రీనివాసులు రెడ్డి (శ్రీని గంగసాని) ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. జులై 3వ తేదీ సాయంత్రం విశ్వయోగి విశ్వంజీ హిందూ సాంప్రదాయ బద్దంగా జ్యోతిని వెలిగించి ఐదు రోజుల ఆపి మహా సభలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వ అధికారులు, అమెరికా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు అట్లాంటాలోని భారత ప్రభుత్వ దౌత్య అధికారిని డాక్టర్ స్వాతి కులకర్ణి కూడా పాల్గొని ఐదు రోజుల డాక్టర్ల సదస్సుకు హాజరైన డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జులై 4వ తేదీ ఉదయం ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలు మరియు భారతీయ సంతతి శాస్త్రవేత్తలు పాల్గొన్న ఆపి సదస్సులో ఇషా యోగ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ముఖ్య ఉపన్యాసం చేస్తూ.. విద్య, వైద్యం, ఆధ్యాత్మికం వ్యాపారం కాకూడదని అన్నారు. ఎప్పుడైతే విద్య, వైద్యం, ఆధ్యాత్మికం వ్యాపారం అవుతాయో అప్పుడే ఆ జాతి పతనం ప్రారంభం అవుతుందని అన్నారు. ఆరోగ్యానికి చిహ్నాలైన వైద్యులు, ప్రజల ఆరోగ్యాన్ని కోరే వైద్యులు మరింత ఆరోగ్యంగా ఉండాలని, లేనిచో ఆ వైద్యుడు రోగుల బాగోగులను ఏం చూడగలడని ప్రశ్నించారు. వైద్యుల, వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని, ఈ పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 37వ వార్షిక ఆపి కన్వెన్షన్, సైన్టిఫిక్ అసెంబ్లీ.. వైద్యులకు వైద్య పరిజ్ఞానం, తమ వృత్తి నైపుణ్యం మెరుగు పరచుకోవడానికి దోహదపడుతోంది. అంతేగాకుండా వైద్యుల కుటుంబ సభ్యులకు తమ పాత మిత్రులను కలుసుకోవటానికి ఆపి సదస్సులు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. అదే ఆపి సదస్సుల దిగ్విజయానికి కారణం. అంతేగాకుండా భారత దేశంలోని వివిధ వైద్య కళాశాలల పాత విద్యార్థుల సమావేశాలు కూడ అత్యంత ఆదరణ పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని గాంధీ, ఉస్మానియా, వరంగల్, వెంకటేశ్వర, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం వైద్య కళాశాలల పాత వైద్య విద్యార్థుల సమావేశాలు ఒక పండుగలా జరిగాయి. ఆపి కన్వెన్షన్, సైంటిఫిక్ అసెంబ్లీలో CME ( కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్) తరగతులు, ప్రొఫెషనల్, బిజినెస్, ఉమెన్స్ ఫోరమ్ వంటి అనేక సదస్సులతో పాటు వైద్య పరికరాలు, వివిధ విక్రయశాలలు, శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వైద్యులు ప్రదర్శించిన నృత్య నాటక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతదేశాన్ని టీబీ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో USAID నుంచి తొమ్మిది మిలియన్ల నిధులతో భారత దేశంలో టీబీ నిర్మూలనకు ఆపి సంస్థ చేపట్టిన కృషి.. ఏంతో ప్రశంసనీయమైనిది. భారత ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలతో ఆపి యొక్క భాగస్వామ్యం అనేక నగరాలు టీబీ ఫ్రీగా మారటానికి ఏంతో దోహదపడుతోంది. -
కఠిన వీసా నిబంధనలు వద్దు
లండన్: కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ ‘స్క్రాప్ ద క్యాప్’పేరిట జరుగుతున్న ప్రచారానికి బ్రిటన్‌లోని ప్రముఖ భారతీయ వైద్యుల సంఘం (బాపియో) మద్దతు పలికింది. బ్రిటన్ జాతీయ వైద్య సేవా విభాగం (ఎన్హెచ్ఎస్) వైద్యుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన భారతీయ వైద్యులను తీసుకుని రావడానికి కఠినమైన వీసా నిబంధనలు అడ్డువస్తున్నాయని బాపియో పేర్కొంది. ‘స్క్రాప్ ద క్యాప్’ ప్రచారం ప్రారంభమైన కొద్ది రోజులకే ఎన్హెచ్ఎస్లో పనిచేయడానికి విదేశీ వైద్యులపై విధించిన కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఆన్లైన్ పిటిషన్‌ను యూకే పార్లమెంట్ వెబ్సైట్లో పెట్టింది. ఈ నేపథ్యంలో బాపియో అధ్యక్షుడు రమేశ్ మెహతా మాట్లాడుతూ.. ‘ఈ ప్రచారానికి మేం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాం. ఈ వీసా వ్యవస్థ వైద్య సేవల అవసరాలను తీర్చేదిగా ఉండాలి’అని అభిప్రాయ పడ్డారు. టైర్–2 వీసా కేటగిరీ కింద యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెలుపల నుంచి ఏడాదికి 20,700 మంది నిపుణులను బ్రిటన్ కంపెనీల్లోకి తీసుకోవడానికి అనుమతి ఉంది. కిందటేడాది డిసెంబర్ వరకు గత ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే పరిమితికి మించి నిపుణులను తీసుకున్నారు. 2017 డిసెంబర్ నుంచి 2018 మార్చి వరకు బ్రిటన్ హోం కార్యాలయం సుమారు 1,500 మంది డాక్టర్ల వీసా దరఖాస్తులను తిరస్కరించింది. ‘ఇక్కడ పదివేల మంది వైద్యులు అవసరం. ఈ మేరకు సరిపడే భారతీయ వైద్యుల జాబితా మా వద్ద ఉంది. నిబంధనలు అందుకు అంగీకరించడం లేదు. భారత్‌కు సైతం వైద్య నిపుణుల అవసరం ఉంది కాబట్టి మేధోవలసను మేం ప్రోత్సహించట్లేదు. వారికి ఇక్కడ శిక్షణ ఇచ్చి తిరిగి భారత్ పంపాలని అనుకుంటున్నాం’ అని మెహతా అన్నారు. -
హెల్త్ టిప్స్
ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నిరూపించారు భారతీయ వైద్యులు. వీటిలో అల్లం ప్రాధాన్యం మరీ ఎక్కువ. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కాని చిటికెడు శొంఠి పొడి కాని ఇవ్వాలి. పెద్దవాళ్లు కూడా మోతాదు పెంచి తీసుకోవచ్చు.జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కాని, శొంఠి పొడి కాని కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లం రసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది. పైత్యంతో వాంతులవుతుంటే శొంఠిని తేనెతో కలిపి చప్పరించాలి. వేవిళ్ళ సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పని చేస్తుంది. నోరు రుచి లేనట్లు ఉండడాన్ని పోగొడుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగుసార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు. అల్లం టీ తాగినప్పుడు కడుపులో వికారం వస్తే డాక్టర్ని సంప్రదించాలి. -
సగం మందికి పైగా శంకర్ దాదాలే!
మీకు ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ వద్దకు వెళ్లారా.. ఆయన మిమ్మల్ని జాగ్రత్తగానే చూశారని అనుకుంటున్నారా? ఎందుకైనా మంచిది.. ఓసారి ఆయన ఏం చదివారో తెలుసుకోండి. ఎందుకంటే మన దేశంలో సగానికి పైగా డాక్టర్లకు అసలు మెడికల్ డిగ్రీలే లేవట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో తెలిపింది. దేశంలో అత్యవసరంగా వైద్యసంస్కరణలు చేపట్టాలని తెలిపింది. 2001 నాటికి దేశంలో 102 కోట్ల జనాభా ఉంటే వారికి కేవలం 20 లక్షల మంది మాత్రమే హెల్త్ వర్కర్లున్నారని, వీళ్లలో 39.6 శాతం మంది వైద్యులని, 30.5 శాతం మంది మిడ్వైఫ్లని, కేవలం 1.2 శాతం మంది మాత్రమే డెంటిస్టులు ఉన్నారని లెక్కలు వివరించింది. వైద్యులలో 77.2 శాతం మంది అలోపతి, 22.8 శాతం మంది హోమియో, ఆయుర్వేదం, యునానీ వైద్యులు. అయితే.. ఇందులో అసలు విషయం ఏమిటంటే మొత్తం అలోపతి డాక్టర్లలో 57.3 శాతం మందికి అసలు మెడికల్ డిగ్రీలే లేవట. 31.4 శాతం మంది అయితే కేవలం సెకండరీ స్కూల్ విద్యతోనే చదువు ఆపేశారు. నర్సుల పరిస్థితి మరీ ఘోరం. 67.1 శాతం మంది అర్హత సెకండరీ స్కూల్ విద్య మాత్రమే. దేశంలోని 73 జిల్లాల్లో అసలు వైద్య పరమైన అర్హతలున్న నర్సులు ఒక్కరు కూడా లేరు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల అర్హతలు దారుణంగా ఉన్నాయి. అలోపతి వైద్యుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయి. పురుష వైద్యుల సంఖ్య బాగా ఎక్కువగానే ఉన్నా, వాళ్ల విద్యార్హతలు మాత్రం మహిళా వైద్యుల కంటే బాగా తక్కువట. అలోపతి వైద్యుల్లో పురుషుల్లో కేవలం 37.7 శాతం మంది మాత్రమే తగిన అర్హతలు ఉన్నవాళ్లయితే మహిళల్లో మాత్రం ఇది 67.2 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 593 జిల్లాలుండగా, 58 జిల్లాల్లో అసలు దంత వైద్యులే లేరట. -
యూకేకు అందని 'భారత' వైద్యం
లండన్: యూకే ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సహాయకుల ఖాళీలను భారతీయులతో నింపాలని అక్కడి సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ ఆరోగ్య సేవ (ఎన్హెచ్ఎస్)లో ఖాళీలపై కామెరాన్ సర్కారు పైవిధంగా ఆలోచించింది. అయితే.. యూకే వీసా విధానం, అక్కడి వైద్య నియమాలు ఇబ్బందికరంగా ఉండటంతో భారతీయులు ఆసక్తి కనబరచటం లేదు. -
భారత వైద్యులకు యూకే ఉద్యోగం కష్టమే!
లండన్: భారత వైద్యులకు బ్రిటన్‌లో ఉద్యోగాలు లభించడం ఇకపై కష్టంగా కనిపిస్తోంది. నైపుణ్యమున్న ఉద్యోగాల్లో యూరప్ దేశాలవారికి అధిక ప్రాధాన్యమిచ్చేలా సరికొత్త వీసా విధానాన్ని తీసుకురావాలని ఆ దేశం యోచిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని నియమించుకోవాలనుకొంటే సదరు కంపెనీ... రెసిడెంట్ లేబర్ మార్కెట్ టెస్ట్ (ఆర్ఎల్ఎంటీ)ను కచ్చితంగా నిర్వహించాలనేది తాజా ప్రతిపాదన. సిబ్బంది కొరత లేనప్పుడు ఈ నిబంధన తప్పక అమలు చేయాలి. బ్రిటన్ మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే నైపుణ్య ఉద్యోగాల్లో యూరప్ కార్మికులకు అధిక ప్రాధాన్యముంటుంది. భారత వైద్య పట్టభద్రులు నేషనల్ హెల్త్ సర్వీస్ పరిధిలోని పై స్థాయి శిక్షణ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ వీసా నిబంధనలు ఎన్హెచ్ఎస్లో తీవ్ర గందరగోళానికి తెరతీస్తాయని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ హెచ్చరించింది. -
బ్రిటన్‌లో భారతీయ డాక్టర్లపై వివక్ష
లండన్: భారత్‌లో వైద్యవిద్యను పూర్తిచేసిన వారు తమ దేశంలో ప్రాక్టీస్ చేయకుండా బ్రిటన్ నిషేధం విధిస్తోంది. భారత్ తర్వాత పాకిస్థాన్, ఈజిప్టు, నైజీరియా దేశాలకు చెందిన డాక్టర్లపై కూడా బ్రిటన్‌లోని జనరల్ మెడికల్ కౌన్సిల్ (జీఎంసీ) నిషేధం విధిస్తోంది. అయితే ఈ దేశాల వారికంటే నిషేధానికి గురైన భారతీయ డాక్టర్ల సంఖ్యే ఎక్కువ. గత ఐదేళ్లలో భారత, పాక్‌లో శిక్షణ పొందిన 117 మంది డాక్టర్లపై బ్రిటన్‌లో పనిచేయకుండా జీఎంసీ ఆంక్షలు విధించింది. భారతీయ డాక్టర్లపై ఈ విధమైన వివక్ష కొనసాగుతోందని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ తెలిపింది. తమను బ్రిటన్‌లో జనరల్ ప్రాక్టీషనర్లుగా చూడకుండా వివక్ష చూపుతున్నారని ఈ సంఘం వేసిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ విషయంలో ఒక విధానాన్ని రూపొందించాలని న్యాయమూర్తి అక్కడి ప్రభుత్వానికి సూచించారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఇద్దరు ఎన్నారై డాక్టర్లు
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 3,00,000 డాలర్ల మేర అనుచిత లబ్ధ్ది పొందారంటూ ఆరుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో సుకేన్ షా, షిముల్ షా అనే ఇద్దరు ప్రవాస భారతీయ డాక్టర్లు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. జీఎస్ఐ కామర్స్ అనే సంస్థను 2011లో ఈబే సంస్థ కొనేందుకు సిద్ధమైంది. సదరు జీఎస్ఐ కామర్స్ సీఈవో క్రిస్టొఫర్ సారిడాకిస్.. ఈ విషయాన్ని అనధికారికంగా సుకేన్, షిముల్ తదితరులకు తెలియజేశారు. దీంతో ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా వీరు లాభాలు పొందారని అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద కేసు సెటిల్ చేసుకోవాలంటే ఎన్నారై డాక్టర్లతో పాటు అయిదుగురు ట్రేడర్లు 4,90,000 డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదే శించింది. క్రిస్టోఫర్‌పై 6,64,822 డాలర్ల పెనాల్టీ విధించింది.