లండన్: భారత వైద్యులకు బ్రిటన్‌లో ఉద్యోగాలు లభించడం ఇకపై కష్టంగా కనిపిస్తోంది. నైపుణ్యమున్న ఉద్యోగాల్లో యూరప్ దేశాలవారికి అధిక ప్రాధాన్యమిచ్చేలా సరికొత్త వీసా విధానాన్ని తీసుకురావాలని ఆ దేశం యోచిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని నియమించుకోవాలనుకొంటే సదరు కంపెనీ... రెసిడెంట్ లేబర్ మార్కెట్ టెస్ట్ (ఆర్‌ఎల్‌ఎంటీ)ను కచ్చితంగా నిర్వహించాలనేది తాజా ప్రతిపాదన. సిబ్బంది కొరత లేనప్పుడు ఈ నిబంధన తప్పక అమలు చేయాలి.
బ్రిటన్ మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే నైపుణ్య ఉద్యోగాల్లో యూరప్ కార్మికులకు అధిక ప్రాధాన్యముంటుంది. భారత వైద్య పట్టభద్రులు నేషనల్ హెల్త్ సర్వీస్ పరిధిలోని పై స్థాయి శిక్షణ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ వీసా నిబంధనలు ఎన్‌హెచ్‌ఎస్‌లో తీవ్ర గందరగోళానికి తెరతీస్తాయని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ హెచ్చరించింది.
భారత వైద్యులకు యూకే ఉద్యోగం కష్టమే!
Published Mon, Feb 22 2016 1:33 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM
Advertisement
Advertisement