హెల్త్‌ టిప్స్‌ | health tips | Sakshi

హెల్త్‌ టిప్స్‌

Mar 27 2017 12:22 AM | Updated on Oct 20 2018 4:36 PM

హెల్త్‌ టిప్స్‌ - Sakshi

హెల్త్‌ టిప్స్‌

ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నిరూపించారు

ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నిరూపించారు భారతీయ వైద్యులు. వీటిలో అల్లం ప్రాధాన్యం మరీ ఎక్కువ. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కాని చిటికెడు శొంఠి పొడి కాని ఇవ్వాలి. పెద్దవాళ్లు కూడా మోతాదు పెంచి తీసుకోవచ్చు.జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కాని, శొంఠి పొడి కాని కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లం రసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది.

పైత్యంతో వాంతులవుతుంటే శొంఠిని తేనెతో కలిపి చప్పరించాలి. వేవిళ్ళ సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పని చేస్తుంది. నోరు రుచి లేనట్లు ఉండడాన్ని పోగొడుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్‌ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగుసార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్‌ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.  అల్లం టీ తాగినప్పుడు కడుపులో వికారం వస్తే డాక్టర్‌ని సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement