చెన్నై : యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా యమ జోష్‌లో ఉన్నారు. విజయాలతో పాటు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటి వరకూ డార్లింగ్, త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాలు విడుదలవ్వగా రెండు చిత్రాలు విజయం సాధించడం విశేషం.కాగా ప్రస్తుతం బ్రూస్‌లీ చిత్రంలో నటిస్తున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇంద కార్తీ కొట్టవన్,తదితర రెండు చిత్రాలలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో చిత్ర అవకాశం ఆయన ఇంటి తలుపు తట్టింది.
ఒరు కల్ ఒరు కన్నాడి, శివ మనసుల శక్తి, ఇటీవల వాసు శరవణన్ ఇన్నా పడిచవంగ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజేశ్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు.దీనికి కడవుల్ ఇరుకాన్ కుమారు అనే టైటిల్ నిర్ణయించారు.ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించనున్నారన్నది తాజా సమాచారం.
కాగా జీవీ ఇటీవల తన చిత్రాలలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం ప్రారంభించారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో ఆనంది,మనీషాయాదవ్‌లతో డ్యూయెట్లు పాడిన జీవీ కడవుల్ ఇరుకాన్ కుమారు చిత్రంలో నటి కీర్తీసురేశ్,ప్రియాఆనంద్‌లతో రొమాన్స్ చేయనున్నారని తెలిసింది.ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.