
శ్రీలీల(Sreeleela).. గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఇది. ఒకవైపు స్టార్ హీరోలతో మరోవైపు యంగ్ స్టార్స్‌లో సినిమాలు చేస్తూ తెలుగు తెరపై దూసుకెళ్తోంది. అయితే ఈ టాలెంటెడ్ బ్యూటీ ఇటీవల తన దూకుడుని తగ్గించింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన చిత్రాలేవి రిలీజ్ కాలేదు. కానీ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూనే.. సడెన్‌గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌కి అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.
అయితే ఈ పాట ఒప్పుకునేందుకు శ్రీలీల కాస్త వెనకడుకు వేసిందట. కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆలోచించిందట. కానీ డైరెక్టర్ సుకుమార్ నచ్చజెప్పి పాటకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పాట శ్రీలీల కెరీర్‌కి ప్లస్సే అయింది. అయితే ఈ పాట షూటింగ్ కోసం వెళ్లినప్పుడు సెట్‌లో రష్మిక(rashmika mandanna)ను చూసి శ్రీలీల భయపడిందట. ఆమెతో మాట్లాడేందుకు కాస్త సిగ్గు పడిందట. దానికి గల కారణం ఏంటో కూడా శ్రీలీల వివరించింది.
శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంలో మొదట రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొంతవరకు షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆమె ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారు. పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్‌లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్‌మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలకు మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే పారితోషికం అందించిందట. ఈ ఒక్క పాటకే దాదాపు రూ. 2 కోట్లు అందించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment