గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్‌లో 'పుష్ప 2' క్రేజ్ | Allu Arjun Pushpa 2 Movie Trailer Launch Event In Patna Gandhi Maidan, Watch Videos Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 Trailer Launch: ఈవెంట్ పాసుల కోసం ఎగబడ్డ బిహారీలు

Published Sun, Nov 17 2024 9:57 AM | Last Updated on Sun, Nov 17 2024 11:34 AM

Pushpa 2 Trailer Launch Updates From Patna

'పుష్ప 2' ట్రైలర్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం రిలీజ్ కానుంది. బిహార్‌లోని పాట్నాలో గ్రాండ్ ఈవెంట్ ఉంది. అయితే ఊరు కాని ఊరులోనూ 'పుష్ప' క్రేజ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ ఈవెంట్ పాసుల కోసం బిహారీలు ఎగబడుతున్నారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ, పాటలు పాడుతూ తెగ సంబరపడిపోతున్నారు.

(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్)

మరికొందరైతే 'పుష్ప' మూవీకి గన్నులు పేల్చి మరీ స్వాగతం పలుకుతామని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే చాలామంది బాలీవుడ్ హీరోలకు సాధ్యం కాని విధంగా నార్త్‪‌లోనూ బన్నీ క్రేజ్ సంపాదించాడనిపిస్తోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కే ఈ రేంజ్ రచ్చ జరుగుతుందంటే.. ఇక సినిమా వస్తే నార్త్‌ ఆడియెన్స్ ఇంకా ఏమేం చేస్తారో అనిపిస్తోంది. సాయంత్రం 6:03 గంటలకు 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అవుతుంది. డిసెంబరు 5న పాన్ ఇండియా వైడ్ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు టాక్.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement