Atla Tadde
-
అల్లు స్నేహా అట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే?
ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే కొందరు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తుంటారు. అల్లు అర్జున్ స్నేహా కూడా ప్రతి పండగని వదలకుండా జరుపుతూ ఉంటుంది. సంక్రాంతి, ఉగాది, వరలక్ష్మి వ్రతం.. ఇలా ఎప్పటికప్పుడు వాటిని చేస్తూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అట్లతద్ది చేసుకుంది.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే తదియ, చతుర్థి నాడు 'అట్ల తద్ది'ని జరుపుకొంటారు. ఉత్తరాదిలో అయితే దీన్ని 'కర్వా చౌత్' అంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు.. మంచివాడు భర్తగా రావాలని దేవుడికి ఈ పూజ చేస్తారు. ఇక పెళ్లయిన వాళ్లయితే భర్త ఆయురారోగ్యలతో ఉండాలని ప్రార్థిస్తారు.అల్లు స్నేహా కూడా వేకువజామునే లేచి అట్లతద్ది చేసుకుంది. ఎర్ర చీరలో అందంగా ముస్తాబై మరీ భర్త బాగోగులు కోసం పూజ చేసింది. ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఇవాళే సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’!
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం! చర్మ వ్యాధులు రాకూడదని.. గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట.... 'కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగామొగ్గ మొగ్గా కాదు మోదుగనీరు నీరుకాదు నిమ్మలబావి బావికాదు వావిటికూర కూరకాదు గుమ్మిడిపండు పండుకాదు పాపిడిమీసం' కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు. 'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా సన్నబియ్యం ఛాయాపప్పు మునగాపప్పూ నీమొగుడెవరు గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి' అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ... 'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మలేకుండా మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు మల్లెలు పూచాయి మొగ్గలేకుండా' ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే 'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు' అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!! 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో' అట్లతద్ది అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం. (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్..
రాయవరం: అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్.. అంటూ మహిళలు ఆటపాటలతో కోలాహలంగా జరుపుకునే పండగ అట్లతద్ది. ముఖ్యంగా వివాహమైన అనంతరం నవ వధువు అట్లతద్ది పండగను తప్పనిసరిగా చేసుకోవడం ఆనవాయితీ. మాంగళ్య బలం కోసం గౌరీదేవిని భక్తితో కొలిచే ఈ పర్వదినాన్ని ఆశ్వీ యుజ మాసం బహుళ తదియ నాడు నోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గ్రామీణ ప్రాంతాల్లో అట్లతద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నెల (అక్టోబర్) 12న అట్లతద్ది పర్వదినం సందర్భంగా పూజకు ఏర్పాట్లు చేసుకునే పనిలో మహిళలు నిమగ్నమై ఉన్నారు. ఇస్తినమ్మ వాయనం.. మహిళలు నోచే నోముల్లో అతి ముఖ్యమైనది అట్లతద్ది పండుగ. వేకువజామునే లేచి స్నానపానాదుల అనంతరం ఐదు గంటల లోపుగా భోజనం చేసి వ్రతాన్ని ప్రారంభిస్తారు. మజ్జిగ అన్నం, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయల పులుసు, గడ్డపెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. కొత్తగా పెళ్లైన యువతులు తప్పనిసరిగా అట్లతో వాయనాలు ఇస్తారు. సాయంత్రం సమయంలో కాలువ వద్దకు వెళ్లి కాలువలో మట్టిని, వరిదుబ్బులను, నవధాన్యాలతో తయారుచేసిన జాజాల బుట్టలను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. నీళ్లలో గౌరమ్మ.. పాలల్లో గౌరమ్మ అంటూ పాటపాడుతూ పూజ అనంతరం వాటిని కాలువలో కలుపుతారు. అట్లతద్దికి ఐదురోజుల ముందుగా చిన్నచిన్న బుట్టల్లో మట్టి వేసి అందులో మెంతులు, పెసలు, కందులు, పత్తి తదితర నవధాన్యాలను వేస్తారు. అట్లతద్ది రోజున మొలకలు వచ్చే విధంగా చూస్తారు. వీటినే జాజాలు అంటారు. ఉయ్యాల ఊగుతూ.. గోరింటాకు పెట్టుకుంటూ.. అట్లతద్ది రోజున మహిళలు తప్పనిసరిగా ఉయ్యాల ఊగుతారు. అదేవిధంగా అట్లతద్దికి ముందురోజున మహిళలు గోరింటాకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కాలువల వద్దకు వెళ్లే సమయంలో పెళ్లిపీటలపై కట్టుకున్న పట్టుచీరను తప్పనిసరిగా ధరిస్తారు. ఉదయం నుంచి కటిక ఉపవాసం చేసే మహిళలు సాయంత్రం పూజ అనంతరం చంద్రదర్శనం కోసం వేచిచూస్తారు. చంద్రుడు కనిపించాక పూజ చేసుకున్న అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. రాయవరం, మండపేట, కపిలేశ్వరపురం, రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాల పరిధిలోని 120 గ్రామాల్లో అట్లతద్ది నోముకు మహిళలు సిద్ధమవుతున్నారు. నోముకు అవసరమైన పూజా సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో మహిళలు ఉన్నారు. ఏటా నోచుకుంటాం ఏటా తప్పనిసరిగా అట్లతద్ది నోము నోచుకుంటాను. ఈ ఏడాది నోముకి ఇప్పటికే జాజాలు సిద్ధం చేసుకున్నాం. పూజకు అవసరమైన ఏర్పాట్లలో ఉన్నాం. – పులగం శివకుమారి, గృహిణి, రాయవరం సౌభాగ్యం కోసం సౌభాగ్యం కోసం గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. అట్లతద్ది రోజు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారిని పూజించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వేడుక మహిళలకు ప్రత్యేకం. – కొప్పిశెట్టి లక్ష్మి, గృహిణి, అద్దంపల్లి, కె.గంగవరం మండలం వాయనాలు ప్రధానం హిందూ సంప్రదాయంలో అట్టతద్దికి పెళ్లైన ఏడాది నవ వధువులు వాయనాలు తీర్చుకోవడం ఈ పర్వదినంలో ప్రధానమైన ప్రక్రియ. అట్లతద్దిని మన ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. – విలపర్తి ఫణిధర్‌శర్మ, అర్చకులు, రాయవరం -
అట్ల తద్ది ప్రత్యేకం: వయసులో ఉన్న ఆడపిల్లలూ ... ఆడుకుందామా...!
ఆటల నోము అట్లతద్ది.. ఆడపిల్లలు నోచే తద్ది అంటూ పవిత్రబంధం సినిమాలో కథానాయికగా వేసిన వాణిశ్రీ వేడుకగా పాడుతుంది. తెలుగు వారి జీవితాలలో అట్లతద్దికి అంత ప్రాధాన్యత ఉంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు ఆట పట్టిస్తారు. ఎవ్వరూ ఎవరితోనూ గొడవపడరు. ఆట పట్టించటాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. తెల్లవారుజామునే పిల్లలంతా పొరపచ్చాలు, హెచ్చుతగ్గులు.. ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఆడుకుంటారు. ఐకమత్యానికి ఈ పండుగ ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా ఈ పండుగలో అనేక కోణాలున్నాయి... ఆడపిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. పూర్వం అందరూ ఇంటి దగ్గరే ఉండేవారు. ఇంట్లో చేసే ప్రతి పనిలోనే వ్యాయామమే. చెరువుకు వెళ్లి బిందెడు నీళ్లు తేవటం, పెరట్లో బావిలో నీళ్లు తోడటం, పప్పులు రుబ్బడం, రవ్వ విసరటం, అప్పడాలు ఒత్తడం... ఏ పని చేసినా పనితో పాటు శరీర ఆరోగ్యానికి కావలసిన వ్యాయామం ఉండేది. దానితో పాటు మనసును కూడా కుదుటపరుస్తుంది. నిరంతరం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారికి ఆటవిడుపు కూడా ఉండాలి. అట్లతద్ది ఆడపిల్లలకు ఆటవిడుపు. ముందు రోజే గోరింటారు పెట్టుకోవాలి. తెల్లవారు జామున సూర్యుని కంటె ముందే నిద్ర లేచి, ముందురోజు రాత్రి అమ్మ వండిన అన్నాన్ని చద్దన్నంగా తినటం ఎంతో సరదా. నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు, తాంబూలం... అన్నీ కడుపు నిండా తిని, ఆహారం అరిగేవరకు ఉయ్యాల ఊగి, ఆటలు ఆడి, బారెడు పొద్దెక్కిన తరవాత ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేయటం... ఇదీ ఈ పండుగ విధానం. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! ఇక్కడితో ఆగదు... అమ్మ వేసే అట్లను కడుపు నిండా తినాలి. కొందరైతే వాయినాలు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయంలో భాగం. మరి తెల్లవారుజామున ఆడే ఆటల్లో ఒక కలివిడితనం ఉంటుంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు దురదగుంటాకుతో వచ్చి ఆడపిల్లల్ని సరదాగా ఆటపట్టించటం, ఈ ఆడపిల్లలు వారిని బెదిరించటం... ఇదీ ఆడమగ తేడా లేకుండా అందరం ఒకటే అనే భావనతో సరదాసరదాగా నడిచే పండుగ. ఎక్కడా శృతిమించని సరదాల వేడుక ఈ పండుగ. ఉయ్యాలో ఉయ్యాల... ఊరు చివర చెరువు గట్టున ఉన్న పెద్దపెద్ద చెట్లకు ఉయ్యాలలు వేసి, ఒకరిని ఒకరు ఊపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసుకునే ప్రకృతి పండుగ. ఏ చెట్టు కొమ్మ ఎంత గట్టిగా ఉందో చూసుకోవటం ప్రధానం. జీవితం అనే ఉయ్యాల దృఢంగా ఉండాలంటే ఆధారం గట్టిగా ఉండాలనే అంతరార్థం చెబుతుంది ఈ పండుగ. నిత్యజీవితంలో ఆటుపోట్లు వస్తాయి. మనసు డోలాయమానంగా అయిపోతుంటుంది. ఎత్తుపల్లాలు చవిచూడాల్సి వస్తుంది. ఒకసారి అంత ఎత్తుకు వెళ్లిపోతాం, ఒకసారి నేల మీదకు పడిపోతాం. అదే ఉయ్యాల అంతరార్థం. పండుగల పరమార్థం వెనకపడిపోవటంతో, అందులోని సామాజిక కోణం మరుగున పడిపోయి, అనవసరమైన చాదస్తాలు మాత్రం మిగిలిపోతున్నాయి. చదవండి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! వయసులో ఉన్న ఆడపిల్లలు ఆటలు ఆడాలి... నలుగురితో కలిసిమెలిసి ఆడుతుంటే, ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించటం నేర్చుకోవాలి. యుక్త వయసు నుంచి ఆలోచనలలో మార్పు వస్తుంది. మంచి మార్గం వైపు కాని, చెడు తోవలోకి కాని వెళ్లే వయసు ఇదే. స్నేహితులతో ఆడుకుంటూ ఉండటం వల్ల, ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకునే అవకాశం కలిగించే పండుగ. అంతేనా యుక్తవయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా అనారోగ్యాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి అనువుగా ఏర్పడిన పండుగలు ఇవి. శరీరం బాగా అలసిపోయే వరకు ఆడుకుంటూ, తోటివారితో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని అందంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన విధంగా పండుగలు మార్గం చూపుతాయి. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ పీట కింద పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లార లేచి రండోయ్... ఎంతో అందమైన పాట ఆశ్వీయుజం వెనుకబడి, కార్తికం వస్తోందంటే చలి ముదురుతుంది. ఆ చలికి ముడుచుకుని పడుకుంటే కుదరదు. చలికి సవాలుగా నిద్ర లేచి చలిని పరుగులు పెట్టించాలి. అందుకే పిల్లలంతా తెల్లవారు జామునే లేచి ఆడుకోవాలని చెప్పే పండుగ ఇది. కడుపు నిండుగా అట్లు తినాలి. మినుములు, బియ్యంతో కలిపి చేసిన అట్లు తింటే ఒళ్లు ఇనుములా తయారవుతుంది. ప్రకృతి సిద్ధంగా ఆడపిల్లల శరీరంలో కలిగే మార్పులకి ఇది చాలా అవసరం. ముద్ద పప్పు తినాలి. పిడికెడు బియ్యాన్ని మాత్రమే అన్నంగా వండుకుని తినాలి. మనం ఈ పాటను ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. అందుకే అట్లతద్దిని అందరూ జరుపుకునేందుకు వీలుగా నోము కింద ఏర్పాటుచేశారు. నోముగా చేసుకునేవారు ఉదయాన్నే కార్యక్రమం పూర్తయ్యాక, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, చందమామను చూశాకే భోజనం చేస్తారు. నోము అంటే మొక్కుబడిగా కాకుండా, త్రికరణశుద్ధిగా ఆచరించాలి. చాదస్తాలకు దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండేలా ఈ పండుగను జరుపుకోవాలని చెబుతుంది మన సంప్రదాయం. ఇదే అట్లతద్దిలోని అంతరార్థం. - వైజయంతి పురాణపండ చదవండి: Pollution In China: ఏటా 7 లక్షల 50 వేల మంది మృతి అందుకేనట! ప్రమాదం అంచున.. చైనా..! -
అట్లతద్ది ఎందుకు చేసుకుంటారంటే..
కోడూరు, భట్టిప్రోలు: మన తెలుగు సంప్రదాయంలో మహిళలు సౌభ్యాగాన్ని ప్రసాదించాలంటూ అనేక వ్రతాలు, నోములు ఆచరించడం మనకు తెలిసిందే. అయితే ప్రతి ఏటా విజయదశమి తరువాత వచ్చే ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకొనే ‘అట్లతది’ పండుగకు మాత్రం ప్రత్యేక విశిష్టత ఉంది. తమతో పాటు కుటుంబమంతా సిరిసంపదలతో వర్థిల్లాలంటూ ఈ పర్వదినం నాడు గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహిళలంతా గౌరీదేవి వ్రతాన్ని నిర్వహించి, చంద్రోదయ వేళ అట్లను నైవేద్యంగా సమర్పించి, ముతైదువులకు వాయనాలను అందిస్తారు. పరమశివుని పతిగా చేసుకొనేందుకు నారదముని సలహా మేరకు గౌరీదేవి తొలిసారి ఈ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చంద్రకళల్లో కొలువైవున్న శక్తి అనుగ్రహంతో స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలు కూడా చెప్పుతున్నాయి. అట్లుకు ప్రత్యేక స్థానం అట్లతద్ది నాడు అట్లుకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. మన ఇళ్లల్లో అట్లు తయారీకి మినుములు, బియ్యాన్ని ఉపయోగించడం చూస్తాం. దీనికి కూడా పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. ఈ ధాన్యాలతో చేసే అట్లను నైవేద్యంగా పెట్టి, వాయనాలను దానంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.. నవగ్రహాల్లో కుజునికి ‘అట్లు’ అంటే మహాప్రీతి అని, వీటిని నైవేద్యంగా సమర్పిస్తే కుజదోషం పోయి వివాహ బంధానికి ఎలాంటి అడ్డంకులు రావని పెద్దల మాట. మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ గ్రామాల్లో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకొనే పండుగల్లో అట్లతద్ది ఒకటి. (చదవండి: ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల') ఈ పండుగకు ప్రతి మహిళ తమ అరచేతుల్లో గోరింటాకు పెట్టుకొని అమితానందాన్ని పొందుతారు. కుటుంబంలో ఎవరి చేయి బాగా పండితే వారు అదృష్టవంతులని విశ్వసిస్తారు. అట్లతద్ది రోజున మహిళలు సూర్యోదయానికి ముందే స్నానపానీయాలు ముగించుకొని, గోంగూర పచ్చడి, పెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం వీధిలో ఒక చోట ఉయ్యాల ఏర్పాటు చేసి ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పు మూడట్లోయ్..’ అంటూ ఆటపాటలతో సరదగా గడుపుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. సాయంత్రం చంద్రోదయం తరువాత మళ్లీ ముత్తయిదువులకు 11 అట్లను వాయనంగా అందించి, పండుగను ముగిస్తారు. ఏదేమైనా అట్లతద్ది పండుగను మంగళవారం జరుపుకొనేందుకు ప్రతి ఇంటి వద్ద మహిళలు ఏర్పాట్లను పూర్తి చేశారు. (చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్)