ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త అధ్యాయం
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం భారత ఎయిర్ ఫోర్స్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు.. అవని చెతుర్వేది(మధ్యప్రదేశ్), మోహనా సింగ్(రాజస్థాన్), భావనా కాంత్(బిహార్) రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో భారత ఎయిర్ ఫోర్స్లో తొలిసారిగా యుద్ధ విమానాలను మహిళలు నడపనున్నారు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 130 మంది పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పారికర్ పాల్గొన్నారు. యుద్ధ విమాన పైలట్లుగా మహిళలను నియమించే విషయంలో దేశంలో ఎంతో కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.