first batch
-
Indian Navy: ఉమెన్–ఫ్రెండ్లీ ధీర... : అగ్నివీర
శిక్షణ కఠినంగా ఉండాలి. అదే సమయంలో అవసరాలు, సౌకర్యాల విషయంలో కరుణతో వ్యవహరించాలి. కళింగ గడ్డ మీద ఉన్న సువిశాల ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రం ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్ ఉమెన్ ట్రైనీలను దృష్టిలో పెట్టుకొని ‘ఉమెన్–ఫ్రెండ్లీ’ విధానానికి శ్రీకారం చుట్టింది... అగ్నివీర్ చుట్టూ రగిలిన వివాదాల మాట ఎలా ఉన్నా సైన్యంలోని వివిధ విభాగాల్లో పని చేయాలనే ఆసక్తి, ఉత్సాహాన్ని ఆ వివాదాలు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి. నేవీలో 3,000 ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీలోకి దిగారు. వీరిలో 82,000 మంది మహిళలు ఉన్నారు. భువనేశ్వర్‌కు సమీపంలోని ప్రసిద్ధ ‘ఐఎన్ఎస్ చిలికా’ శిక్షణా కేంద్రంలోకి నేవి అగ్నివీర్ ఫస్ట్ ఉమెన్ బ్యాచ్‌కు చెందిన 600 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. దాంతో మహిళా శిక్షణార్థుల అవసరాలు, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఐఎన్ఎస్. సువిశాలమైన ఐఎన్ఎస్ శిక్షణాకేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకమైన గదులు, డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని టాయిలెట్లను నిర్మిస్తున్నారు. శానిటరీ పాడ్ వెండింగ్, డిస్పోజల్ యంత్రాలను, సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. వర్కర్స్, స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా మహిళలనే నియమిస్తారు. ఉమెన్ ఆఫీసర్స్ ట్రైనీలకు సంబంధించి శిక్షణపరమైన పర్యవేక్షణ బాధ్యతలతో పాటు వారి వ్యక్తిగత ఇబ్బందులు, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తారు. ‘ప్రైవసీతో సహా మహిళా శిక్షణార్థులకు సంబంధించి రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన మార్పులు చేయనున్నాం’ అంటున్నారు నేవీ ఉన్నతాధికారి ఎం.ఏ.హంపిహోలి. స్త్రీ, పురుషులకు సంబంధించి ట్రైనింగ్ కరికులమ్‌లో తేడా అనేది లేకపోయినా తప్పనిసరి అనిపించే ఫిజికల్ స్టాండర్డ్స్‌లో తేడాలు ఉంటాయి. అగ్నిపథ్ తొలిదశలో పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంక్(పిబివోఆర్) క్యాడర్లో మహిళలను రిక్రూట్ చేస్తున్న తొలి విభాగం నేవి. ‘సెయిలర్స్’గా మహిళలకు తొలిసారిగా అవకాశం కల్పించడం ఒక చారిత్రక అడుగు. ‘భవిష్యత్ అవసరాలు, స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని నావికాదళం ప్రగతిశీలమైన అడుగులు వేస్తుంది’ అంటుంది కమాండర్ గౌరీ మిశ్రా. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నేవీకి చెందిన ఆల్–ఉమెన్ టీమ్ ‘నావిక సాగర్ పరిక్రమ’ పేరుతో ప్రపంచ నౌకాయాత్ర చేసి చరిత్ర సృష్టించింది. ‘ఇది మా వ్యక్తిగత సంతోషానికి, సాహసానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు... ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చి సాహసంతో ముందుకు నడిపే చారిత్రక విజయం’ అన్నారు ‘నావిక సాగర్ పరిక్రమ’లో భాగం అయిన అయిదు మంది మహిళా అధికారులు. కొన్ని రోజులు వెనక్కి వెళితే... ఉత్తర అరేబియా సముద్రంలో సర్వైవలెన్స్ మిషన్‌లో భాగం అయిన ‘ఆల్–ఉమెన్ క్రూ’ మరో సంచలనం. తాజా విషయానికి వస్తే... భవిష్యత్ పనితీరుకు శిక్షణ సమయం పునాదిలాంటిది. అది గట్టిగా ఉండాలంటే సౌకర్యాలు, అవసరాల విషయంలో తగిన శ్రద్ధ చూపాలి. ఇప్పుడు మహిళా ట్రైనీల విషయంలో ‘ఐన్ఎన్ఎస్ చిలికా’ చేస్తున్నది అదే. -
టోక్యోకు భారత్ నుంచి తొలి బృందం
న్యూఢిల్లీ: శతకోటి ఆశలను, ఆకాంక్షలను మోసుకుంటూ భారత్ నుంచి క్రీడాకారులు, క్రీడాధికారులతో కూడిన తొలి బృందం శనివారం రాత్రి టోక్యోకు పయనమైంది. తొలి బృందంలో 88 మంది ఉన్నారు. ఇందులో ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జూడో, జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొనే 54 మంది క్రీడాకారులు ఉన్నారు. మిగతా వారు సహాయ సిబ్బంది ఉన్నారు. భారత్ నుంచి మొత్తం 127 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... విదేశాల్లో శిక్షణకెళ్లిన పలువురు క్రీడాకారులు అక్కడి నుంచే నేరుగా టోక్యో చేరుకుంటున్నారు. షూటర్లకు క్వారంటైన్ లేదు విదేశాల్లో శిక్షణ తీసుకున్న భారత షూటర్లు నేరుగా టోక్యోకు చేరడంతో క్వారంటైన్ తప్పింది. దీంతో వారంతా సోమవారం నుంచి ప్రాక్టీస్ చేసుకునే వీలు చిక్కింది. ఒలింపిక్స్‌కు అర్హత పొందిన 15 మంది షూటర్లలో 13 మంది క్రొయేషియాలో, ఇద్దరు స్కీట్ షూటర్లు ఇటలీలో తుది కసరత్తు చేశారు. ఆటలకు సమయం దగ్గరపడటంతో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఒక్కటైన షూటింగ్ జట్టు అక్కడి నుంచి శనివారం ఉదయం టోక్యోకు చేరుకుంది. -
మహిళా మిలటరీ పోలీస్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది!
ఇండియన్ ఆర్మీలోని పోలీస్ సేనాదళం.. ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ (సీఎంపీ) తొలిసారి మహిళల్ని విధుల్లోకి తీసుకుంది! శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు 83 మంది కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. సీఎంపీలో ఇప్పటివరకు ఆఫీసర్స్ కేటగిరీలో మాత్రమే మహిళలు ఉంటూ వస్తున్నారు. సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించడం మాత్రం ఇదే మొదటిసారి. బెంగళూరులోని ద్రోణాచార్య పరేడ్ గ్రౌండ్లో శనివారంనాడు చాలా నిశ్శబ్దంగా ఒక ప్రతిష్టాత్మకమైన ‘పాసింగ్ అవుట్ పరేడ్’ జరిగిపోయింది! కోవిడ్ నిబంధనలు లేకుంటే పరేడ్‌ను చూసేందుకు యువ సైనికుల తల్లిదండ్రులు కూడా వచ్చేవారు. పైగా ఆ పరేడ్ మన దేశానికే ప్రథమమైనది, ప్రత్యేకమైనది. ఇండియన్ ఆర్మీలోని పోలీస్ సైనిక విభాగం అయిన ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్’ (సీఎంపీ) లో చేరేందుకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు వాళ్లంతా. బెంగళూరు ద్రోణాచార్య పరేడ్ గ్రౌండ్లో మే 8న జరిగిన మహిళా మిలటరీ పోలీస్ ‘పాసింగ్ అవుట్ పరేడ్’. సీఎంపీ ఆవిర్భావం తర్వాత ఈ ఆర్మీ విభాగంలో మహిళలకు ప్రవేశం లభించడం ఇదే తొలిసారి! నేటి నుంచి ఈ మహిళా మిలటరీ పోలీసులు తమ విధులకు హాజరవుతారు. ఏం చేస్తారు ఈ మహిళా మిలటరీ పోలీసు లు? కండబలం, గుండె బలం ఉన్న పనులు చేస్తారు. మిలటరీ, పోలీస్ క్వార్టర్స్‌ని కనిపెట్టుకుని ఉంటారు. యుద్ధ ఖైదీల కదలికలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఆర్మీ సైనికులు క్రమశిక్షణను, ఆదేశాలను అతిక్రమించకుండా చూస్తారు. త్రివిధ దళాలలోని మూడు పోలీసు విభాగాలకు, పౌర రక్షణ పోలీసు విభాగాలకు సమన్వయకర్తలుగా ఉంటారు. ఆర్మీ సిబ్బందికి సంబంధం ఉన్న కేసులలో విచారణలకు హాజరవుతారు. ఆర్మీల చీఫ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్లకు భద్రతగా ఉంటారు. ఇంకా అనేకం ఉన్నాయి. చొరబాటు ‘దారులలో’ శత్రువు సృష్టించిన కృత్రిమ ట్రాఫిక్ జామ్‌లను క్లియర్ చేస్తారు. టెలీ కమ్యూనికేషన్ తెగిపోయినప్పుడు రంగంలోకి దిగి సమాచారాన్ని పునరుద్ధరిస్తారు. ఇవన్నీ చేయడానికి సీఎంపీ విభాగం అరవై ఒక్క వారాల శిక్షణ ఇస్తుంది. తాజాగా ఈ శిక్షణ పూర్తి చేసిన ఎనభై మూడు మంది మహిళా అభ్యర్థులు ఆర్మీ పొదిలోకి అస్త్రాలుగా పదును తేలారు. బెంగళూరులోని ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్’ శిక్షణను ఇచ్చింది. ఆర్మీ తొలిసారి మహిళల కోసం ‘సోల్జర్ జనరల్ డ్యూటీ’ కేటగిరీ ఉద్యోగాలకు గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ చూసి ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నవాళ్లలో శిక్షణకు అర్హులైన వాళ్లే.. ఈ ఎనభై మూడు మంది. భారత రక్షణదళంలో కేవలం ఆర్మీకి మాత్రమే ‘ఆఫీసర్’ ర్యాంకు కన్నా దిగువన ఉండే హోదాలలో మహిళల్ని నియమించుకునే అధికారం ఉంది. నావిక, వైమానిక దళాలకు ఆ అవకాశం లేదు. అయినప్పటికీ ఆర్మీలోని సీఎంపీకి మహిళా సోల్జర్లను తీసుకోడానికి 82 ఏళ్లు పట్టింది. సీఎంపీ ఆవిర్భవించింది 1939లో. మహిళా ఆఫీసర్లను తీసుకుంటున్న ఆర్మీకి కానీ, ఆర్మీలోని సీఎంపీ విభాగానికి కానీ ఇంతకాలం సాధారణ మహిళా సైనికులను తీసుకోడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?! జటిల సమస్య లు, కఠిన పరిస్థితులు ఉండే విధుల్లో మహిళల్ని తీసుకోవడం సరికాదు అన్న ఆలోచనా ధోరణే. అయితే అలవాటు లేని రంగాలలో సైతం మహిళ లు రాణిస్తుండటంతో ఆ ధోరణి మారింది. అదొక్కటే కాదు దేశ భద్రత విభాగాలలో ఆర్మీకి మహిళా సైనికుల చేయూత అవసరం అవుతోంది. అందుకే సీఎంపీలోకి మహిళల్ని తీసుకునేందుకు ఆర్మీ 2019 జనవరిలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందింది. ఏడాదికి వంద మంది చొప్పున 2036 నాటికి 1700 మంది మహిళల్ని సీఎంపిలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎంపీలో ప్రస్తుతం సుమారు 9000 మంది సిబ్బంది ఉండగా, మొత్తం ఆర్మీలో రిజర్వు సిబ్బంది కాకుండా 12 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో మహిళా అధికారులు 1672 మంది, సాధారణ స్థాయి మహిళలు సుమారు ఏడు వేల మంది. -
రా.. రా.. రఫేల్!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్సు నుంచి బయలుదేరాయి. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇవి చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి ఈనెల 29వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. ఈ విమానం ప్రత్యేకతలు.. శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ జెట్లకు ఉంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించగలిగే మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతోపాటు ఈ జెట్లలో భారత్ కోరిన విధంగా..ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లో–బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లున్నాయి. మొత్తం భారత్‌కు వచ్చే 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు(ఒకటే సీటుండేది) కాగా, 6 శిక్షణ విమానాలు రెండు సీట్లుండేవి. ఈ తేడా తప్పితే రెండింటి సామర్థ్యం ఒక్కటే. ఒక స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్‌లో. మరో స్క్వాడ్రన్‌ను బెంగాల్‌లోని హసిమారా బేస్‌లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ రూ.400 కోట్లు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేల్‌లను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావ సూచకంగా వైద్య పరికరాలు, నిపుణులతో కూడిన విమానాన్ని కూడా ఫ్రాన్సు పంపిస్తోందని ఫ్రాన్సులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత
శ్రీనగర్/జమ్మూ: పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది తొలి బ్యాచ్‌గా 2,234 మంది భక్తులు ఆదివారం గట్టి భద్రత మధ్య జమ్మూకు చేరుకున్నారు. 2017లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసినందువల్ల ఇప్పుడు బహుళ అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి వచ్చిన 300 అదనపు కంపెనీల భద్రతా దళాలనే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. యాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ యాత్రకు రావడానికి దేశవ్యాప్తంగా ఒకటిన్నర లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 46 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని 36 కిలో మీటర్ల పొడవైన పహల్గామ్ మార్గం, గండేర్బల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తాల్ మార్గాల్లో యాత్ర సాగుతుంది. 93 వాహనాలతో కూడిన తొలి వాహన శ్రేణిని గవర్నర్ సలహాదారు కేకే శర్మ ఆదివారం జమ్మూలోని భాగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. -
డేగ నీడలో అమర్నాథ్ యాత్ర షురూ
జమ్మూ: అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 1,138మంది యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు జమ్మూ నుంచి బయలుదేరారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్, మరో మంత్రి ప్రియా సేథి, లోక్ సభ సభ్యుడు జుగాల్ కిషోర్ జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ వద్ద శుక్రవారం ఉదయం 5గంటలకు జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. తొలి యాత్రకు బయలుదేరిన వారిలో 900మంది పురుషులు, 225మంది మహిళలు, 13మంది పిల్లలు ఉన్నారు. మొత్తం 24 మినీ బస్సుల్లో, ఇతర ప్రైవేటు వాహనాల్లో బయలుదేరారు. వీరి వెనుక ప్రత్యేక భద్రతా బలగాలు కూడా కదిలాయి. శనివారం నుంచి అమర్ నాథ్ ఆలయం దర్శన యాత్ర ప్రారంభవుతున్న నేపథ్యంలో తొలి బ్యాచ్ కు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున చొరబాట్లు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి కేవలం భద్రత బలగాలనే కాకుండా ప్రత్యేక ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా యాత్రలో భాగం చేస్తున్నారు. ఈ రోజు రాజ్ నాథ్ సింగ్ భద్రతా ఏర్పాట్లు సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్ వస్తున్నారు. ఆయన రెండురోజులపాటు ఇక్కడే ఉంటారు. 48 రోజులపాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 18న ముగుస్తుంది. -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త అధ్యాయం
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం భారత ఎయిర్ ఫోర్స్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు.. అవని చెతుర్వేది(మధ్యప్రదేశ్), మోహనా సింగ్(రాజస్థాన్), భావనా కాంత్(బిహార్) రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో భారత ఎయిర్ ఫోర్స్‌లో తొలిసారిగా యుద్ధ విమానాలను మహిళలు నడపనున్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 130 మంది పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పారికర్ పాల్గొన్నారు. యుద్ధ విమాన పైలట్లుగా మహిళలను నియమించే విషయంలో దేశంలో ఎంతో కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.