
మిస్సైల్‌ను పరిశీలిస్తున్న మెరైన్ ఎస్‌ఐ రసూల్ సాహెబ్
విడవలూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెదపాళెం తీరంలో శనివారం బయటపడింది జెట్ విమాన శకలం కాదని, ఎయిర్‌ఫోర్స్ మిస్సైల్ అని మెరైన్ అధికారులు నిర్థారించారు. ఇస్కపల్లి మెరైన్ సీఐ పెంచలరెడ్డి, ఎస్‌ఐలు రసూల్ సాహెబ్, మహేంద్రలు ఆదివారం శకలాలను పరిశీలించారు. సీఐ పెంచలరెడ్డి మాట్లాడుతూ..‘ఇది గుంటూరు జిల్లా సూర్యలంక తీరం నుంచి గతంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రయోగించిన మిస్సైల్’ అని చెప్పారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని తెలిపారు.
ఇలాంటివి 3 ప్రయోగించగా, ఇప్పటికి 2 లభించాయని, తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో మరొకటి లభించిందన్నారు. దీన్ని ఇస్కపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి మెరైన్ అధికారులకు సమాచారమిచ్చామని, త్వరలోనే వారు దీనిని తీసుకువెళతారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment