ఇక రంగంలోకి ఎయిర్ ఫోర్స్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అడవుల్లో రగులుతున్న దావానలాన్ని అదుపుచేసేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్-17 హెలికాప్టర్లను ఉపయోగించి అడవుల్లో మంటలు వ్యాపిస్తున్న చోట్ల నీటి జల్లులు కురిపించనుంది. ఉత్తరాఖండ్ అడవుల్లో మొదలైన కార్చిచ్చు దాదాపు మూడు వేల ఎకరాలమేర విస్తరించిన హరిత వనాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది.
ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ లో మొత్తం 922 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రగులుతున్న కార్చిచ్చును నిలువరించేందుకు దాదాపు 3 వేలమంది అధికారులు రంగంలోకి దిగారు. వీరిలో మూడు కంపెనీల జాతీయ విపత్తు నిర్వహణా దళం, రాష్ట్ర విపత్తు బృందం, భారత ఆర్మీ దళానికి చెందిన వారు ఉన్నారు. చమోలీ, పౌరి, రుద్రప్రయాగ్, టెహ్రీ, ఉత్తర్ కాశీ, అల్మోరా, పితోర్ ఘడ్, నైనిటాల్ ప్రాంతాలు ఈ కారు చిచ్చుకారణంగా సర్వనాశంనం అయ్యాయి.