choppers
-
మరిన్ని యుద్ధ విమానాలు భారత్‌కు.. రక్షణ శాఖ అనుమతి
భారత రక్షణ దళంలోని వాయుసేన విభాగం పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రక్షణ దళ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తేలికపాటి యుద్ద విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా మరో 97 తేజస్ యుద్ధ విమానాలను, 156 ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. ఈ రెండు రకాల విమానాలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయనున్నారు. దేశీయ కంపెనీల నుంచి రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం ఆమోదం తెలిపింది. వీటి ఒప్పందాల విలువ సుమారు రూ. 1.1 లక్షల కోట్లు ఉండనుంది. అదనంగా భారత వైమానిక దళం కోసం తేజస్ మార్క్ 1-ఏ యుద్ధ విమానాలు.. వైమానిక దళం, సైన్యం కోసం హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించనుంది. రాబోయే కొన్నేళ్లలో భారత వైమానిక దళంలో అమ్ముల పొదలో కొత్త యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే.. భారత్ చరిత్రలోనే స్వదేశీ సంస్థ తయారుచేయనున్న అతిపెద్ద ఆర్డర్ కానుంది. ఇప్పుడే అనుమతి లభించిన నేపథ్యంలో విమానాలు రూపుదిద్దుకునే వరకు సమయం పట్టనుంది. అయితే విదేశీ తయారీదారులు భాగస్వామ్యం అయితే తక్కువ కాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది. -
కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ యూత్ వింగ్ నిర్వహించిన ర్యాలీ సందర్బంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే నిరంకుశత్వం రాజ్యమేలుతుందని ఈ ఏడాది చివర్లోగాని వచ్చే ఏడాది ప్రారంభంలో గాని లోక్‌సభ ఎన్నికలు ఉంటాయని అధికార బీజేపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రత్యర్ధులు గెలుపుకోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తారని.. ఇటీవల పర్గణాస్ జిల్లా 24 నార్త్‌లో బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం లాంటి దురాగతాలకు పాల్పడటానికి కూడా వెనకడుగు వేయరని. అలాంటివారికి వారికి కొంతమంది పోలీసులు కూడా సహకరిస్తుండటం సరికాదన్నారు. చాల మంది పోలీసులు తమ పనిని తాము చిత్తశుద్ధితో చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే దుష్టశక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. ర్యాగింగ్ నిరోధక విభాగం ఉన్నట్లే అవినీతి నిరోధక విభాగం కూడా ఉందని వారికి గుర్తు చేస్తున్నానన్నారు. కాషాయం బాణాసంచాతో ఏమి ప్రయోజనం ఉంటుంది? పచ్చ బాణాసంచాతో అయితే వాతావరణానికి కూడా మేలు కలుగుతుంది కదా అన్నారు. ఇప్పటికే కాషాయ పార్టీ ఎన్నికల కోసం తన అమ్ములపొదిలో అస్త్రాలన్నిటినీ సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే వారు దేశమంతటా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. మళ్ళీ వారు అధికారంలోకి వస్తే దేశాన్ని ద్వేషపూరితంగా మార్చేస్తారు. బీజేపీ ఇతర పార్టీల వారికి అవకాశం లేకుండా ఎన్నికల కోసం మొత్తం హెలికాఫ్టర్లన్నిటినీ బుక్ చేసేశారన్నారు. ఇదే క్రమంలో ఆమె బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ని కూడా లక్ష్యం చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వొద్దు. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలు రాజ్యమేలిన కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు వారేలా చేసిన ఘనత నాదని పరోక్షంగా గవర్నర్‌ని ఉద్దేశించి అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో 'గోలీ మారో' అంటూ నినాదాలు చేస్తున్న ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను కటకటాలోకి నెట్టామని, మళ్ళీ లాంటి నినాదాలు చేసేవారంతా ఇది యూపీ కాదు బెంగాల్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: ఆ లెక్చరర్ని ఎందుకు సస్పెండ్ చేశారు.. సుప్రీంకోర్టు -
ఇక రంగంలోకి ఎయిర్ ఫోర్స్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అడవుల్లో రగులుతున్న దావానలాన్ని అదుపుచేసేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-17 హెలికాప్టర్లను ఉపయోగించి అడవుల్లో మంటలు వ్యాపిస్తున్న చోట్ల నీటి జల్లులు కురిపించనుంది. ఉత్తరాఖండ్ అడవుల్లో మొదలైన కార్చిచ్చు దాదాపు మూడు వేల ఎకరాలమేర విస్తరించిన హరిత వనాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ లో మొత్తం 922 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రగులుతున్న కార్చిచ్చును నిలువరించేందుకు దాదాపు 3 వేలమంది అధికారులు రంగంలోకి దిగారు. వీరిలో మూడు కంపెనీల జాతీయ విపత్తు నిర్వహణా దళం, రాష్ట్ర విపత్తు బృందం, భారత ఆర్మీ దళానికి చెందిన వారు ఉన్నారు. చమోలీ, పౌరి, రుద్రప్రయాగ్, టెహ్రీ, ఉత్తర్ కాశీ, అల్మోరా, పితోర్ ఘడ్, నైనిటాల్ ప్రాంతాలు ఈ కారు చిచ్చుకారణంగా సర్వనాశంనం అయ్యాయి. -
హెలికాప్టర్లను తిరిగిచ్చేస్తున్న బీజేపీ!
బీహార్ ఎన్నికల సంరంభంలో బీజేపీ ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పడం లేదు. ప్రస్తుత సమయంలో పార్టీల విషయంలో భిన్నమైన వ్యూహం అవసరమని బీజేపీ గ్రహించినట్లు తెలుస్తోంది. ఇంకా మూడుదశల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా పార్టీ ప్రచారానికి హెలికాప్టర్ల వాడకం అనూహ్యంగా తగ్గించుకుంది. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగాల్సిన తరుణంలో పార్టీ.. అద్దె హెలికాప్టర్ల సంఖ్యను తగ్గించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండోదశ ఎన్నికల సమయంలోనే బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చి వేసింది. వార్తాపత్రికల్లో ప్రకటనల దగ్గరనుంచి.. బిల్ బోర్డుల వరకూ ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల బొమ్మలు కూడా ఎక్కడా కనపడకుండా స్థానిక నాయకులు జాగ్రత్త పడ్డారు. ఈ ఎన్నికలపై ప్రధాని ప్రభావం పడటం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని, పూర్తిగా స్థానిక ఎన్నికలుగానే జరగాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికలకు విరుద్ధంగా ఈసారి ప్రచారం కోసం హెలికాప్టర్ల వాడకాన్ని భారీగా తగ్గించినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో హెలికాప్టర్లను ప్రచారంకోసం రోడ్డుమార్గం సరిగా లేని ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు ఉపయోగిస్తుంటారు. మొదట్లో సుమారు 16 హెలికాప్టర్లను బీజేపీ కోసం అద్దెకు తీసుకుంది. అక్టోబర్ 16 రెండోదశ పోలింగ్ పూర్తయిన తరువాత ఐదు హెలికాప్టర్లను తిరిగి ఇచ్చేసినట్లు పాట్నా ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. రెండోదశ పోలింగ్ తర్వాత హెలికాప్టర్ల సంఖ్య తగ్గించినట్లు బీజేపీ బీహార్ శాఖ సీనియర్ నాయకుడు కూడా ధ్రువీకరించారు. అయితే ఎందుకన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. బీహార్ లోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిదశ ఎన్నికలు అక్టోబర్ 12న జరుగగా... రెండో దశలో మొత్తం 32 సీట్లకు ఎన్నికలు జరిగేందుకు నిర్దేశించారు. దుర్గాపూజ, మొహర్రం పండుగల కారణంగా ఎన్నికల షెడ్యూల్ లో బాగా దూరం ఏర్పడింది. మిగిలిన 162 నియోజకవర్గాల్లో అక్టోబర్ 28, నవంబర్1, నవంబర్ 5 తేదీల్లో ఎన్నికలు జరిపేందుకు ఖరారు చేయగా నవంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. రెండు ఇంజన్లు ఉన్న హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాలంటే సుమారు గంటకు 1.8 లక్షలు... ప్లస్ 14 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. అదే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ కు లక్ష రూపాయలతోపాటు సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రముఖ నాయకులు సుమారు రోజుకు నాలుగు గంటలు ప్రచారం నిర్వహించాల్సి వస్తుంటుంది. మొదటి విడత ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీలు దాదాపు 55 మిలియన్ల మంది ఓటర్లను కలిసేందుకు రెండు డజన్ల ప్రైవేట్ హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బీజేపీ 16 మాత్రమే అద్దెకు తీసుకుంది. వీటిని పార్టీ స్టార్ ప్రచారకులు నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు.. ఓ డజను మంది బీహార్ కేంద్ర మంత్రుల ప్రచారం కోసం ఉపయోగించారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జేడీయూ), లాలు ప్రసాద్ (ఆర్జేడీ)తో పాటు... కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. ఈసారి కూడా ఈ పార్టీలు అవే హెలికాప్టర్లను వాడేందుకు నిర్ణయించుకున్నాయని పాట్నా ఎయిర్ పోర్ట్ అధికారి తెలిపారు. -
ఎలక్షన్ వేళ లోహవిహంగాలకు కలెక్షన్లే కలెక్షన్లు
ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ... పాద యాత్రలు కొద్ది మంది నేతలే చేస్తారు. మిగిలిన నేతలు ఆకాశమార్గం పడతారు. విమానాలపై ప్రయాణాలు చేస్తారు. అందుకే ఈ ఎన్నికల సీజన్ లో దేశంలోని 130 చార్టర్డ్ విమాన సంస్థలు భారీగా బిజినెస్ చేసుకుంటున్నాయి. ఎన్నిక ఎన్నికకీ ఎన్నికల వ్యయం పెరుగుతోంది. దీనితో విమాన ప్రయాణాల ఖర్చులు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని గత రెండేళ్లుగా నష్టాల్లో ఉన్న చార్టర్డ్ విమాన సేవల రంగం ఒక్కసారిగా పుంజుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఒక అంచనా ప్రకారం బిజినెస్ లో దాదాపు 40 శాతం వరకూ పెరుగుదల ఉంది. వ్యాపార వర్గాల కథనం మేరకు ఒక్కో ప్రధాన రాజకీయ పార్టీ దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయల మేరకు ఎన్నికల వేళ విమాన లేదా హెలికాప్టర్ యానానికి ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటివరకూ లోహవిహంగాల్లో అత్యధిక సమయం ప్రయాణించిన ఘనత నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకే దక్కుతుంది. ఇద్దరూ రోజూ మూడు నాలుగు సభల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి దేశమంతా చుట్టి వచ్చేందుకు విమానాలు తప్పనిసరవుతున్నాయి. ఇంతగా విమానాలను వాడుతున్నా వారు 200 నియోజకవర్గాలకు మించి వెళ్లడం కష్టం. విమానాలు లేకపోతే నలభై యాభై నియోజకవర్గాలను మాత్రమే టచ్ చేయగలుగుతారు. చార్టర్డ్ విమానయాన రంగం నిఫుణుల కథనాల మేరకు దాదాపు 520 హెలికాప్టర్లు, విమానాలు అద్దెకు దొరుకుతున్నాయి. మామూలు సింగిల్ ఇంజన్ విమానాలు గంటకు 75000 నుంచి లక్ష రూపాయల వరకూ చార్జి చేస్తున్నాయి. అయితే ముఖ్య నేతలు డబుల్ ఇంజన్ ఉన్న నాలుగు సీటర్లను కోరుకుంటున్నారు. ఇవి గంటకు 2.5 నుంచి 3 లక్షల వరకూ అద్దెని వసూలు చేస్తాయి. ఒక్క విమాన సంస్థలే కాదు ఎయిర్ పోర్టులు లాండింగ్, టేకాఫ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. విమానాల మరమ్మత్తులు, మెయింటెనెన్సు కూడా భారీ ఆదాయాన్నిస్తోంది. కాబట్టి ఒక్క విమాన కంపెనీలే కాక వివిధ అనుబంధ పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా ఎన్నికల సీజన్ నుంచి భారీ లాభాలు పొందుతున్నాయి. ఎన్నికల వేళ ఇనుప రెక్కల పక్షులు మరింత లాభాలను పొందుతాయన్నదే పరిశ్రమ వర్గాల అంచనా. దీని వల్ల నష్టాల్లో ఉన్న పరిశ్రమలు లాభాల మేఘాల మీద పరుగులు తీస్తాయని వారంటున్నారు.