డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అడవిలో పుట్టిన కార్చిచ్చు .. అంతకంతకూ విస్తరిస్తూ.. చుట్టుపక్కల ఉన్న గ్రామలకు పెనుముప్పుగా మారింది. అడవిని శరవేగంగా దహిస్తున్న దావానలం.. ఆదివారం నాటికి సమీపంలోని గ్రామాలపై విరుచుకుపడే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. మంటలను అదుపుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను కూడా మంటలను అదుపు చేయడానికి వినియోగిస్తున్నారు.
మంటలు ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో సమీపంలోని ప్రజలకు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. శుక్రవారం అడవిలో పుట్టిన ఈ మంటలు అదే రోజు రాత్రికి సమీపంలోని గ్రామాలకు పాకిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మంటలను అదుపు చేయడానికి గ్రామస్తులు, ప్రభుత్వ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఉత్తరాఖండ్లో ఇంకా అదుపులోకి రాని మంటలు
Published Sun, May 1 2016 3:03 PM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
Advertisement
Advertisement